“అంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టేశారు..?” అంటూ… “విరాట్ కోహ్లీ” స్కోర్ ప్రెడిక్షన్ ట్వీట్‌పై 15 ట్రోల్స్..!

“అంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టేశారు..?” అంటూ… “విరాట్ కోహ్లీ” స్కోర్ ప్రెడిక్షన్ ట్వీట్‌పై 15 ట్రోల్స్..!

by Mohana Priya

Ads

విరాట్ కోహ్లీకి ఇవాల్టి మ్యాచ్ ఒక ప్రత్యేకమైన మ్యాచ్ గా నిలిచింది. అందుకు కారణం విరాట్ కోహ్లీకి ఇది 100వ టెస్ట్ మ్యాచ్. మ్యాచ్ కి ముందు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదగా స్పెషల్ క్యాప్, ట్రోఫీ అందుకున్నారు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Video Advertisement

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డ్ సాధించారు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరుగుతున్న టెస్ట్ లో 60 బంతుల్లో 4×4 సాయంతో 38 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టెస్టుల్లో 8,000 పరుగుల మార్క్‌ని చేరుకున్నారు. దాంతో టీమిండియా 38.5 ఓవర్లు ముగిసే సమయానికి 158/2 స్కోర్ తో నిలిచింది.

Trending trolls on virat kohli score prediction tweet

కోహ్లీతో పాటు క్రీజ్ లో ఉన్న హనుమ విహారి (53 నాటౌట్: 101 బంతుల్లో 5×4) చేయగా, ఇద్దరూ మూడో వికెట్‌కి అజేయంగా 125 బంతుల్లో 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మొత్తంగా తన కెరీర్ లో 100 వ టెస్ట్ మ్యాచ్ లో 8 వేల పరుగుల మార్క్‌ని అందుకున్న రెండో క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచారు. అయితే విరాట్ కోహ్లీ మ్యాచ్ స్కోర్ చెప్తూ ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. ఇందులో ఆ ట్విటర్ యూజర్ చెప్పినట్టుగానే విరాట్ కోహ్లీ స్కోర్ చేశారు. దాంతో ఇంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టారు అంటూ మీమ్స్ వస్తున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10 #11#12#13#14#15


End of Article

You may also like