“పేరు గుర్తుందిగా..? సర్ రవీంద్ర జడేజా..!” అంటూ… IND Vs SL మొదటి టెస్ట్‌లో “జడేజా” 175 చేయడంపై 15 మీమ్స్..!

“పేరు గుర్తుందిగా..? సర్ రవీంద్ర జడేజా..!” అంటూ… IND Vs SL మొదటి టెస్ట్‌లో “జడేజా” 175 చేయడంపై 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

శ్రీలంకతో మొహాలీ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ ని 574/8 దగ్గర డిక్లేర్ చేసింది. ఇన్నింగ్స్ కొనసాగించిన రవీంద్ర జడేజా (175 నాటౌట్: 228 బంతుల్లో 17×4, 3×6) భారీ సెంచరీ నమోదు చేశారు. మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.

Video Advertisement

మొదటిరోజు హిట్టర్ రిషబ్ పంత్ (96: 97 బంతుల్లో 9×4, 4×6) చేయగా, ఇవాళ రవీంద్ర జడేజాతో కలిసి అశ్విన్ (61: 82 బంతుల్లో 8×4) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. మహ్మద్ షమీ (20 నాటౌట్: 34 బంతుల్లో 3×4)తో కలిసి కేవలం 94 బంతుల్లోనే 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రవీంద్ర జడేజా డబుల్ సెంచరీ సాధిస్తారు అని అనుకున్నారు.

memes on jadeja scoring 175 in ind vs sl 1st test day 2

కానీ జట్టు స్కోర్ 574 వద్ద 130 ఓవర్‌లో రెండు బంతులు ముగిసిన తర్వాత భారత ఇన్నింగ్స్‌ని కెప్టెన్ రోహిత్ శర్మ డిక్లేర్ చేసారు.  మ్యాచ్‌లో రవీంద్ర జడేజా మూడు శతక భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్నారు. అందులోనూ మొదటి ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత మూడు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు అయ్యాయి. శ్రీలంక బౌలర్లలో లక్మల్ రెండు వికెట్లు, ఫెర్నాండో రెండు వికెట్లు, లసిత్ ఎంబుల్డేనియా రెండు వికెట్లు, లాహిరు కుమార ఒక వికెట్, డిసిల్వా ఒక వికెట్ పడగొట్టారు.

#1

#2#3#4#5#6#7#8#9#10


End of Article

You may also like