ఆ సినిమా తరువాత కోట్ల ఆఫర్ వచ్చినా ఎన్టీఆర్ శివుడి పాత్రని ఎందుకు చేయలేదు..? అసలు కారణం ఇదే..!

ఆ సినిమా తరువాత కోట్ల ఆఫర్ వచ్చినా ఎన్టీఆర్ శివుడి పాత్రని ఎందుకు చేయలేదు..? అసలు కారణం ఇదే..!

by Anudeep

Ads

సీనియర్ ఎన్టీఆర్ కి ఎంత పేరు ఉందో మనకి తెలుసు. నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్. సినిమా పరిశ్రమలో ఎదురులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పౌరాణిక పాత్రల తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్. నిజానికి అన్న గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.

Video Advertisement

ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నటించిన సినిమాలు ఆయనని నిత్యం ప్రేక్షకుల గుండెల్లోనే ఉంచుతాయి. ఆయన గురించి ప్రతి విషయాన్నీ ఇప్పటికీ ఆసక్తిగా తెలుసుకునే అభిమానులు ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు.

ntr 1

తన కెరీర్ లో సీనియర్ ఎన్టీఆర్ గారు ఎన్నోసార్లు కృష్ణుడిగా, రాముడిగా నటించారు. చాలా మంది తెలుగు ప్రేక్షకులకి ఇప్పటికీ రాముడు లేదా కృష్ణుడిని తలుచుకుంటే ఎన్టీఆర్ రూపమే కళ్ళ ముందే కనబడుతూ ఉంటుంది. అంతగా ఆయన తెలుగు ప్రేక్షకులని మాయ చేసేసారు. అయితే ఎన్టీఆర్ శివుడిగా కూడా నటించారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. 1961 లో వచ్చిన సినిమాలో ఎన్టీఆర్ శివుడిగా నటించారు.

ntr 2

ఈ సినిమాలో ఎన్టీఆర్ మొదటిసారి శివుడిగా నటించారు. ఈ సినిమా భారీ విజయమే సాధించింది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ మరోసారి శివుడిగా నటించడానికి ఒప్పుకోలేదు. దానికి కారణం ఏంటంటే.. ఈ సినిమా పూర్తవ్వగానే.. ఎన్టీఆర్ చెన్నైకి వెళ్లారు. అక్కడే ఆయనో చేదు వార్తని విన్నారు. ఆయన పెద్ద కుమారుడు రామకృష్ణ మరణించారని ఆయనకి తెలియడంతో ఎన్టీఆర్ షాక్ లోకి వెళ్లిపోయారు.

ntr 3

ఆ తరువాత దర్శకుడు విఠలాచార్య ఓ జ్యోతిష్కునితో కలిసి ఎన్టీఆర్ ను కలవడానికి వచ్చారు. వారు మాట్లాడుకుంటూ ఉండగా.. ఆ జ్యోతిష్కుడు జీవితంలో ఎప్పుడు శివుడి పాత్రలో నటించొద్దని ఎన్టీఆర్ కు చెబుతాడు.ఆ పాత్రలో నటించడం వల్లనే పెద్ద కుమారుడు మరణించాడని చెబుతాడు. ఇదంతా ఎన్టీఆర్ నమ్మలేదు. కాదని వాదించారు. కానీ, జ్యోతిష్యాన్ని తక్కువ అంచనా వేయద్దని ఆ జ్యోతిష్యుడు చెప్పడంతో ఎన్టీఆర్ శివుడి పాత్రలలో నటించే ఆలోచనని విరమించుకున్నారు. ఆ తరువాత ఎన్ని కోట్ల రూపాయల ఆఫర్లు వచ్చిన శివుడి పాత్రలలో నటించలేదు.


End of Article

You may also like