లేటు వయసులో పెళ్లి చేసుకుంటే ఇన్ని లాభాలున్నాయా.? ఈ యాంగిల్ లో ఎప్పుడు చూసుండరు.!

లేటు వయసులో పెళ్లి చేసుకుంటే ఇన్ని లాభాలున్నాయా.? ఈ యాంగిల్ లో ఎప్పుడు చూసుండరు.!

by Anudeep

మనిషికి మనిషికి తోడు ఉంటే ఎంతో బాగుంటుంది. నిజానికి మనిషికి మనిషికి తోడు ఉంటేనే జీవితానికి అర్థం కూడా ఉంటుంది. భార్యకి భర్త, భర్తకి భార్య కష్టసుఖాలను పంచుకోవడానికి.. అండగా నిలవడానికి.. ప్రోత్సహించడానికి.. అభినందించడానికి… తప్పులని తెలియ చేయడానికి ఉండాలి. అది అవసరం కూడా. పైగా పెళ్లి ఒక గొప్ప సెక్యూరిటీని ఇస్తుంది.

మానసికంగా పెళ్లి ఒక గొప్ప శక్తిని కూడా ఇస్తుంది. కొందరు మగవాళ్ళు ఉద్యోగానికి వెళ్లక పోయినా సరే భార్యలు తమ సొంత జీతంతో ఇల్లును నెట్టుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు.

అయితే ఇటీవలి కాలంలో చాలా మంది యువత తమ పెళ్లి ఆలస్యం చేస్తున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు పెళ్లి ఎక్కువ కాలం పాటు ఆలస్యం చేయడం మంచిది కాదని పెద్ద వాళ్ళు అభిప్రాయపడుతూ ఉంటారు. మరీ నలభై ఏళ్ల దాకా ఆలస్యం చేయకుండా.. కొద్ది పాటి ఆలస్యంతో పెళ్లి చేసుకోవడం వలన కూడా కొన్ని లాభాలుంటాయట. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

wedding

ప్రతి మనిషి జీవితంలో 20 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న కాలం కెరీర్ పరంగా ఎంతో ముఖ్యమైనది. ఆ సమయంలో ఇతర వ్యాపకాలతో కాలయాపన చేయకుండా.. కెరీర్ పై దృష్టి పెట్టి మంచి భవిష్యత్ కు బాట వేసుకోవాలి. అదే ఈ వయసులో పెళ్లి చేసుకుంటే బాధ్యతల వలన కెరీర్ పై దృష్టి పెట్టలేరు. ఇక 30 ఏళ్ళు వచ్చే సరికి ఒక మనిషి పూర్తిగా పరిణతి చెందుతాడు. మంచి చెడు లను అంచనా వేయడంలోను, అవతలి వ్యక్తిని అర్ధం చేసుకోవడంలోనూ జ్ఞానం సంపాదిస్తాడు.

అందుకే ఈ వయసులో పెళ్లి ఎటువంటి అనర్ధాలకు తావివ్వదు. ఉద్యోగంలో అప్పటికే నిలదొక్కుకుని ఉంటాడు కాబట్టి మరొక వ్యక్తి బాధ్యతని తీసుకోవడానికి కూడా అతనికి పూర్తి విశ్వాసం ఉంటుంది. ఉద్యోగం చేయడం వలన వచ్చే ఆత్మవిశ్వాసం పెళ్లి అయ్యిన తరువాత జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే.. ఈ వయసులో ఎక్కువగా డబ్బుని దుబారా చేయరు. జీవితంపై పరిపూర్ణ అవగాహనతోనే గడుపుతారు. అలాగే.. తమకంటే చిన్న వయసులో.. లేదా ముందే పెళ్లి అయిపోయిన వారిని చూసి ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది.

 

You may also like