డాక్టర్ బాబు, మోనిత రొమాంటిక్ ట్రీట్ ఇచ్చిపడేశారుగా.. అక్కడ కుదరకపోయినా.. ఇక్కడ తగ్గేదేలే..!

డాక్టర్ బాబు, మోనిత రొమాంటిక్ ట్రీట్ ఇచ్చిపడేశారుగా.. అక్కడ కుదరకపోయినా.. ఇక్కడ తగ్గేదేలే..!

by Anudeep

Ads

కార్తీకదీపం సీరియల్ ఎంతటి క్రేజ్ ను సంపాదించుకుందో మనందరికీ తెలిసిన విషయమే. సాయంత్రం అయితే చాలు ఎపుడు వస్తుందా ఆ సీరియల్ అని ఎదురు చూస్తూ ఉంటారు.అత్యంత టాప్ రేటింగ్ ఉన్న సీరియల్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Video Advertisement

అయితే.. ఇటీవలి ఎపిసోడ్స్ లో చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కార్తీక్, మోనిత, దీప క్యారెక్టర్లను సీరియల్ నుంచి తీసేసారు. ఈ సీరియల్ లో కార్తీక్ పాత్రపై మోనిత పాత్రకు చాలా ప్రేమ ఉంటుంది.

karthik-monitha 1

ఆ ప్రేమ కోసమే చేయకూడని తప్పులన్నీ చేస్తుంది. చివరకు ఈ రెండు పాత్రల మధ్య ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు లేకుండానే ఈ సీరియల్ నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఇది ఇలా ఉంటె.. తాజాగా హోలీ సెలెబ్రేషన్స్ లో భాగంగా ‘కలర్స్ ఆఫ్ రొమాన్స్-తగ్గేదేలే’ అనే స్పెషల్ ఈవెంట్ లో కార్తీక్, మోనితలు కూడా జోడిగా పాల్గొన్నారు.

karthik-monitha 3

బుల్లితెర పాపులర్ జోడిలన్నీ కలిసి ఈ ఈవెంట్ లో సందడి చేయనున్నాయి. టైటిల్ కి తగ్గట్లే ఈ సీరియల్ జంటలు కలిసి రొమాన్స్ తో సందడి చేయనున్నారు. ఇక ఇటీవలే ఈ ఈవెంట్ తాలూకు ప్రోమో విడుదల కావడంతో.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాక్టర్ బాబు, మోనితలు సైతం “సఖియా.. చెలియా..” అంటూ రొమాన్స్ లో మునిగి తేలారు.

karthik-monitha 2

డాక్టర్ బాబు అయితే ఏకంగా మోనితని ఎత్తుకుని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాడు. వీళ్లిద్దరు ఇలా చూసుకుంటూ ఉండగానే “జానకి కలగనలేదు” ఫేమ్ అమర్ “ఆ కన్వినెంట్.. ఆకంఫర్టూ” అంటూ సెటైర్ కూడా వేసేశాడు. ఇక యాంకర్ రవి వేసిన డబుల్ మీనింగ్ సెటైర్లకు అదుపే లేదు అన్నట్లు ఉంది. కాగా.. ఈ ఈవెంట్ మార్చి 20 సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది.


End of Article

You may also like