భార్య/ భర్తని అతిగా ప్రేమిస్తే జరిగే అనర్ధాలు ఇవే.. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజాలేంటో తెలుసుకోండి..!

భార్య/ భర్తని అతిగా ప్రేమిస్తే జరిగే అనర్ధాలు ఇవే.. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజాలేంటో తెలుసుకోండి..!

by Anudeep

Ads

సాధారణంగా భార్యా భర్తలు అన్నాక ఒకరిమీద ఒకరికి ప్రేమ, నమ్మకం ఉంటాయి. అయితే ఒక్కోసారి ఆ ప్రేమ ఎక్కువ అయినా కూడా కష్టమే అవుతుంది. జీవిత భాగస్వామి విషయంలో ఉండే అతి ప్రేమ ఒక్కోసారి మనలని వారికి దూరం చేస్తుంది కూడా.

Video Advertisement

భార్యని కానీ, భర్తని కానీ అతిగా ప్రేమించడం వలన కలిగే అనర్ధాలు ఎలా ఉంటాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. ప్రేమ ఉండాలి కానీ, అది అవతలి వారిని మరింత ఇబ్బంది పెట్టేలానో, మరింత బాధ పెట్టేలానో ఉండకూడదు.

possessive 1

కొంతమంది అమ్మాయిలు అయినా, అబ్బాయిలు అయినా తాము ప్రేమించే వారి పట్ల ఎక్కువ కేరింగ్ చూపిస్తూ ఉంటారు. వారు ప్రేమించే వ్యక్తుల పట్ల వారు చూపించే పొసెసివ్ నెస్ అవతలివారికి ఇబ్బందికరంగా మారుతుంటుంది. వారికి వీరిపై ఉండే ప్రేమ కాస్త చిరాకుగా మారుతుంది. ఇలా ఎక్కువ పొసెసివ్ గా ఉండేవారు అవతలివారు చెప్పేది వినిపించుకోరు.

తాము చెప్పిందే వినాలని, తాము చెప్పినట్లు వింటేనే వారికి మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. వారి దృష్టిలో ఇది మంచి కోరే చెప్పినట్లు ఉన్నా.. అవతలివారికి మాత్రం ఈ పొసెసివ్ నెస్ చిరాకు తెప్పిస్తుంది. అవతలి వారు తమ ఒపీనియన్ కి వేల్యూ ఇవ్వట్లేదు అని ఫీల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకసారి ఇలాంటి అభిప్రాయం ఏర్పడ్డాక ఆ రిలేషన్ నిలబడే అవకాశాలు తక్కువే ఉంటాయి. భార్యా అయినా భర్త అయినా తమ పార్టనర్ కి ఈక్వల్ వేల్యూ ఇవ్వాలి. అవతలి వారి అభిప్రాయాలను కూడా గౌరవించాలి.

ఒక్కోసారి ఈ అతి ప్రేమ అనుమానాలకు కూడా తావిస్తుంది. తాము ప్రేమించే వారు మరో వ్యక్తితో మాట్లాడినా అది తప్పుగానే కనబడుతూ ఉంటుంది. అతి ప్రేమ వలన.. మీరు ఎంతగా ప్రేమించినా.. అవతలివారికి అది అనుమానం గా కనపడి మీపై అనుమానస్తుడు/అనుమానస్తురాలుగా ముద్ర వేయచ్చు. దానివలన మీ రిలేషన్ ప్రమాదంలో పడుతుంది. ప్రేమలో ఒక్కసారి అనుమానానికి చోటు దొరికాక.. ఆ ప్రేమ నిలబడదు. అందుకే మీ ప్రేమ ఎలాంటిది..? అన్న విషయమై మీరు నిరంతరం విశ్లేషించుకుంటూ ఉండాలి.


End of Article

You may also like