Ads
ఎట్టకేలకు ఎంతగానో ఎదురు చూసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
Video Advertisement
ఇప్పటి వరకు రిలీజ్ పై ఎన్నో సందేహాలు నెలకొని ఉన్నాయి. అయితే.. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అవడంతో ఇంకా సందేహాలకు ఫుల్ స్టాప్ చెప్పి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే.. ఈ సినిమాపై కొన్ని విమర్శలు కూడా లేకపోలేదు.
చరిత్ర గర్వించదగ్గ వీరుడు అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ వారి వద్ద పని చేసే పోలీసుగా చూపించడాన్ని అసలు ఎవరూ అంగీకరించలేకపోతున్నారు. మరో వైపు అల్లూరి, కుమ్రం భీములు నిజ చరిత్రలో కలవలేదని.. ఈ సినిమాలో కలిసి పోరాడినట్లు ఎలా చూపిస్తారని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వీటిపై రాజమౌళి గతంలోనే సమాధానం చెప్పారు. ఈ సినిమాను కేవలం వారి పాత్రలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని మాత్రమే రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటె.. ఈ సినిమా విడుదల అయ్యాక మరిన్ని విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రముఖ సినీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ విమర్శలపై స్పందించారు. ఈ సినిమాలో చరిత్రని వక్రీకరించలేదని, కేవలం వారి పాత్రలను ఇన్స్పిరేషన్ గా మాత్రమే తీసుకున్నామన్నారు. మరోవైపు.. దాన వీర శూర కర్ణ సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ సినిమాలో ఓ సన్నివేశం ఉంటుంది. ఈ సినిమాలో శ్రీకృష్ణుడు “నీవు ద్రౌపదిపై మనసు పడ్డావు కదా.. ఆమె నిన్ను ఆరో భర్తగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది..” అంటూ ఓ డైలాగ్ చెబుతాడు. కానీ.. ఇది మహాభారతంలో ఎక్కడా చెప్పబడలేదు. ఇటువంటి సన్నివేశాలను వక్రీకరించడం అని అంటారని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
End of Article