Ads
బెంగళూర్ కు చెందిన పట్టాభిరామన్ వయసు 74 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఆయన ఆటో నడుపుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు అని అడిగితే.. నా గర్ల్ ఫ్రెండ్ కోసమే అని నవ్వేస్తారాయన.. ఆ తరువాత ఆయనే చెప్తారు.. తన భార్యని తాను గర్ల్ ఫ్రెండ్ అనే పిలుస్తానని.. భార్యని ప్రియురాలిగా చూసుకోవాలి తప్ప సేవకురాలిగా కాదని చెప్తారు.
Video Advertisement
గత పదునాలుగేళ్లుగా ఆటోని నడుపుతున్న పట్టాభిరామన్ గతంలో ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేసారు. భార్య అంటే ఎనలేని ప్రేమ కలిగిన రామన్ కథ ఓ పాసెంజర్ ద్వారా అందరికి తెలిసింది.
బెంగళూర్ లో నికిత అయ్యర్ అనే ఓ ఉద్యోగిని తన జీవితంలో జరిగిన ఓ పరిచయాన్ని లింక్డ్ ఇన్ లో పంచుకుంది. ఆ పోస్ట్ ఎందరినో ఆకట్టుకుంది. ఎంతగానో వైరల్ అయ్యింది. ఆ పోస్ట్ ఎవరి గురించో కాదు. రామన్ గురించే. ఓ రోజు నిఖితా అయ్యర్ ఆఫీస్ కు వెళ్ళడానికి బయటకు వచ్చింది. ఓ వైపు ఆఫీస్ కు లేట్ అవుతున్న సమయంలో తాను బుక్ చేసుకున్న ఉబెర్ ఆటో డ్రైవర్ రోడ్డు మధ్యలోనే వదిలి వెళ్ళిపోయాడు. నా ఆఫీస్ ఊరికి చాలా దూరం. అసలే కంగారులో ఉన్న టైం లో ఓ పెద్దాయన గమనించి ఎక్కడకి వెళ్ళాలి అని అడిగాడు. అతని వయసు చూసి సరిగ్గా తీసుకెళ్లగలడో లేదో అని భయపడ్డాను.
కానీ అతను చాలా స్వచ్ఛమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఆఫీస్ కు లేట్ అవుతుందన్న భయంతో అతని ఆటోని ఎక్కాను. ఒక ఆటో డ్రైవర్ అయ్యుండి ఇంత మంచి ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలుగుతున్నారు అని ఆయన్ని అడిగాను. గతంలో ఓ ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేసానని చెప్పుకొచ్చారు. మరి ఆటో ఎందుకు నడుపుతున్నారు అని అడిగితే.. నా 45 నిమిషాల ప్రయాణంలో ఆయన తన కథని చెప్పుకొచ్చారు.
ఆయన పేరు పట్టాభిరామన్, ఎం.ఏ, ఎం.ఇడి చేసారు. కానీ, బెంగళూరు కు వచ్చాక ఆయనకు ఎవరూ లెక్చరర్ ఉద్యోగం ఇవ్వకపోవడంతో ఆయన విసిగిపోయి తిరిగి ముంబై కి వెళ్లిపోయారు. 60 ఏళ్ళు నిండే వరకు అక్కడ లెక్చరర్ గా పని చేసి.. తర్వాత బెంగళూర్ కు వచ్చి ఆటో నడుపుకుంటున్నారు. ప్రైవేట్ గా పని చేసే లెక్చరర్లకు పెన్షన్ ఉండదు. తిరిగి టీచర్ గానే పని చేయాలన్న.. 15 వేలకు మించి జీతం రాదు. అదే ఆటో నడుపుకుంటే.. వచ్చే ఆదాయంతో నా గర్ల్ ఫ్రెండ్ ని హాయిగా చేసుకుంటున్నా అని చెప్పి నవ్వేస్తారు.
గర్ల్ ఫ్రెండ్ అన్న మాటకి నవ్వు వచ్చి.. గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగాను.. దానికి అతను నవ్వి నా భార్యే నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పారు. ఆమె వయసు ఇప్పుడు 72 సంవత్సరాలు. ఈ వయసులో కూడా నన్ను ఇంటిని మంచిగా చూసుకుంటుంది అని చెప్పారు. మరి పిల్లలు లేరా అని అడిగాను. వాళ్ళ జీవితం వాళ్లదే అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మేము ఉంటున్న సింగల్ బెడ్ రూమ్ ఇంటికి నెలకు 12 వేలు అద్దె. ఆ అద్దెను వాళ్లే కడతారు. అంతకుమించి వారి నుంచి మేము ఏమీ ఆశించము. మాకు ఉన్న దానిలోనే మేము సంతృప్తిగా గడుపుతున్నాము అని చెప్పుకొచ్చారు. అతను మాట్లాడినంత సేపు అతని మాటల్లో ఎక్కడ జీవితం పట్ల ఫిర్యాదు కానీ, నిరాశ కానీ, నిస్పృహ కానీ కనిపించలేదు. ఆయన్ను చూసాక మానసిక ఆనందం లేనప్పుడు ఎన్ని లక్షలు, కోట్లు ఉన్నా ఏమి ప్రయోజనం అనిపించక మానదు.
End of Article