ప్రభాస్ పెళ్లి అయ్యాకే పెళ్లి చేసుకుంటా.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..?

ప్రభాస్ పెళ్లి అయ్యాకే పెళ్లి చేసుకుంటా.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..?

by Anudeep

Ads

టాలీవుడ్ హీరోలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే ముందు గుర్తొచ్చే పేరు ప్రభాస్ ది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించేసుకున్నాడు. బాహుబలి రెండు పార్ట్ ల తర్వాత.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లను ఒప్పుకుని బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Video Advertisement

ఇటీవలే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదల అయ్యింది. తాజాగా ఓటిటి లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ కు చెందిన ఓ హీరోయిన్ ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించింది.

prabhas 1

హీరో ప్రభాస్ అంటే తనకు క్రష్ ఉందని, ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని టాలీవుడ్ నటీమణులలో ఒకరైన శ్రీ రాపాక చెప్పుకొచ్చారు. ప్రభాస్ అంటే చాలా ఇష్టం ఉందని, ప్రభాస్ సినిమాలలో నటించే అవకాశం వస్తే వదులుకునే ఛాన్స్ లేదని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

బుల్లితెరపై ఏమైనా ప్రభాస్ సినిమాలను వేసినా.. ప్రభాస్ ను అలా చూస్తూ ఉండిపోతానని చెప్పుకొచ్చింది. పలు సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసిన శ్రీ రాపాక ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పెళ్లి గురించి చెప్పుకొచ్చారు. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని.. ప్రభాస్ కు పెళ్లి అయ్యిన తరువాతే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చారు.


End of Article

You may also like