Ads
జయసుధ పేరు వినగానే ముందు గుర్తొచ్చేది మన ఇంట్లో అమ్మ లాగానో, పిన్ని లాగానో, లేదంటే అమ్మమ్మ లాగానో కనిపించే నిండైన రూపం. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తల్లి గా, నానమ్మ గా కూడా పాత్రలు పోషించి కుటుంబ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు.
Video Advertisement
ఆమెకు చాలా మంది అభిమానులే ఉన్నారు తప్ప హేటర్స్ ఎవరు లేని నటి గా ఆమె పేరు ప్రఖ్యాతలు గడించారు. అయితే చాల మందికి తెలియని విషయం ఏంటంటే జయసుధ గారికి సినిమాలంటే అస్సలు ఆసక్తి ఉండదట.
మూడేసి గంటల పాటు తలుపులు మూసిన గదిలో కూర్చుని ఎవరు సినిమాలు చూస్తారు అని అనుకుంటూ ఉంటారట. మొదటినుంచి ఆమె సినిమాలకు వ్యతిరేకంగానే ఉండేవారట. అయితే అనుకోకుండా ఆమెకు పండంటి కాపురం సినిమాలో అవకాశం వచ్చింది. ఆమె సినిమాల్లో రాణిస్తారని, పెద్ద స్టార్ అవుతారని ఆమె తల్లి తండ్రులకు ముందే ఓ జ్యోతిష్యుడు చెప్పారట. కానీ సినిమాలంటే ఆసక్తి లేని జయసుధ సినిమాల్లో ఎందుకు నటిస్తుంది అని నవ్వుకున్నారట.
కానీ, ఆ తరువాత అదే నిజమైంది. జయసుధకు తల్లితండ్రులు పెట్టిన పేరు సుజాత. అయితే, పండంటి కాపురం సినిమాలో నటించాక మరో రెండు అవకాశాలు వచ్చాయి. అప్పటికే ఆమెకు పేరు రావడంతో మరిన్ని అవకాశాలు వచ్చాయట. అయితే.. ఇండస్ట్రీ లో సుజాత పేరుతొ ఆల్రెడీ సెలెబ్రిటీ ఉండడంతో.. ఆమె తండ్రి రమేష్ జయసుధగా పేరు మార్పించారు. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. జయసుధ తండ్రి రమేష్ కు స్వయానా చెల్లెలే విజయ నిర్మల గారు. అంటే.. విజయ నిర్మల గారు జయసుధకు మేనత్త అవుతారు. ఈ లెక్కన మహేష్ బాబు జయసుధకు బావ వరుస అవుతారన్నమాట.
End of Article