Ads
బ్రబౌర్న్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్ జట్టుకి, గుజరాత్ టైటాన్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు లో పవర్ హిట్టర్ లివింగ్‌స్టోన్ (64: 27 బంతుల్లో 7×4, 4×6) హాఫ్ సెంచరీ నమోదు చేయగా, శిఖర్ ధావన్ (35: 30 బంతుల్లో 4×4), జితేశ్ శర్మ (23: 11 బంతుల్లో 1×4, 2×6), రాహుల్ చాహర్ (22 నాటౌట్: 14 బంతుల్లో 2×4, 1×6) స్కోర్ చేశారు.
Video Advertisement
లివింగ్‌స్టోన్ 14 దగ్గర అవుట్ అయిపోవాల్సి ఉన్నా కూడా ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా సిక్స్ కోసం లివింగ్‌స్టోన్ హిట్ చేయడంతో బాల్ ని అందుకున్న గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అడుగు పెట్టారు. ఈ కారణంగా లివింగ్‌స్టోన్‌కి లైఫ్‌తో పాటు ఆరు పరుగులు కూడా లభించాయి.
గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు, దర్శన్ రెండు వికెట్లు పడగొట్టారు. దాంతో పంజాబ్ కింగ్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు స్కోర్ చేసింది. 190 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభమన్ గిల్ (96: 59 బంతుల్లో 11×4, 1×6) చేశారు. ఓపెనర్ మాథ్యూ వెడ్ (6) నుంచి సహకారం లభించకపోయినా యువ క్రికెటర్ సాయి సుదర్శన్ (35: 30 బంతుల్లో 4×4, 1×6)తో కలిసి గుజరాత్ స్కోరు బోర్డ్ ని ముందుకు నడిపించారు. స్లాగ్ ఓవర్లలో హార్దిక్ పాండ్య (27: 18 బంతుల్లో 5×4)తో కలిసి దూకుడుగా ఆడిన శుభమన్ గిల్ జట్టు స్కోర్ 170 వద్ద ఉన్నప్పుడు అవుటయ్యారు. ఆ తర్వాత జట్టు స్కోర్ 172 వద్ద ఉన్నప్పుడు హార్దిక్ పాండ్య లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ రనౌట్ అయ్యారు. చివరిలో రాహుల్ తెవాటియా బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లతో గుజరాత్ టైటాన్స్‌ని గెలిపించడానికి ముఖ్య పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article