Ads
గత కొన్నేళ్లను గమనించి చుస్తే తెలుగు సినిమా స్థాయి పెరిగిందనే చెప్పవచ్చు. ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమా దేశ వ్యాప్తంగా మంచి వసూళ్లను సాధిస్తున్న ఈ క్రమంలో.. యావత్ దేశ ప్రజలు తెలుగు సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా.. మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆసక్తికర వ్యాఖ్యలను చేసారు.
Video Advertisement
బాహుబలి సిరీస్, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు తెలుగు సినిమా రేంజ్ ను పెంచుతూ వచ్చాయి. రాబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల పై కూడా దేశ ప్రజలు కన్నేసి ఉంచారు. మరో వైపు కెజిఎఫ్ లాంటి సినిమాలు కూడా సౌత్ ఇండస్ట్రీ స్థాయిని పెంచుతున్నాయి.
ఈ క్రమంలో తెలుగు సినిమాలను ఉద్దేశించి మాట్లాడిన మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ యావత్ దేశ ప్రజలకు తెలుగు సినిమా డైరెక్టర్లు సుపరిచితులేనని అన్నారు. ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీ కొంచం పెద్దదేనని అన్నారు. తెలుగు ప్రజలు మధ్యప్రదేశ్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని.. మధ్య ప్రదేశ్ ప్రజలతో కలిసి మెలసి ఉంటారని చెప్పుకొచ్చారు.
ఇటీవల తెలుగు సంగమం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మాటలు మాట్లాడారు. నాడు తెలుగు సినిమాలను, తెలుగు ప్రజలను ప్రపంచం గుర్తించే విధంగా సీనియర్ ఎన్టీఆర్ గారు కృషి చేసారని.. నేడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ తెలుగు వాళ్లకు గుర్తింపుని తీసుకొస్తున్నారని కితాబిచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీ దేశానికీ బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ లాంటి మంచి సినిమాలను అందిస్తోందని ప్రశంసించారు. భవిష్యత్ లో ప్రపంచ దేశాలు తెలుగు సినిమాల కోసం, ఇండియన్ సినిమాల కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.
End of Article