Ads
తెలుగు సీరియల్స్ లో కార్తీక దీపం సీరియల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సీరియల్ లో నటించే నటీనటుల అందరూ దాదాపు ప్రతి తెలుగువారి కుటుంబంలో ఒక భాగమైపోయారు. హీరో, హీరోయిన్లే కాకుండా చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఈ సీరియల్ లో చాలా బాగా నటిస్తారు.
Video Advertisement
అందుకే కార్తీక దీపం సీరియల్ లో నటించే చిన్న పిల్లలకి కూడా దాదాపు హీరోహీరోయిన్లకి ఉన్నంత పాపులారిటీ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కార్తీక దీపం సీరియల్ సూపర్ హిట్ టాక్ తో నడుస్తోంది.
సమయం తెలుగు కథనం ప్రకారం.. ప్రస్తుతం నడుస్తున్న ఎపిసోడ్స్ లో కార్తీక దీపంలో చిన్న పిల్లలుగా ఉన్న హిమ, సౌర్య పెరిగి పెద్ద వాళ్ళు అయిన సంగతి తెలిసిందే. కాగా.. నిన్న ప్రసారమైన ఎపిసోడ్ లో అల్లరి పిల్ల జ్వాల ఆటోని స్వప్న తగలబెట్టేసింది. మాటకి మాట ఎదురు చెప్పడంతోనే ఆగ్రహించి అంత పని చేసేసింది. ఇప్పుడు ప్రసారం అవుతున్న ఎపిసోడ్ లలో అన్నీ కొత్త పాత్రలే ఉంటున్న సంగతి తెలిసిందే.
పాత వాళ్ళని తప్పించేసి.. కొత్త వాళ్ళతోనే కథని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీప కార్తీక్ లు మరణిస్తారు. వారి మరణానికి కారణం హిమ అని భావించి సౌర్య ఆమెపై పగబడుతుంది. ప్రస్తుతం ఈ అక్క చెల్లెళ్ళ చుట్టూనే కథని సాగదీస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్లో జ్వాలాతో గొడవ పడ్డ స్వప్న ఆమె ఆటోని తగలబెట్టేసింది. దీనితో జ్వాల బాగా ఏడుస్తుంది. కాగా.. ఇందుకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా ఫేస్ బుక్ లో రిలీజ్ చేసింది.
దీనిని ఆటో యూనియన్లు సీరియస్ గా తీసుకున్నారు. ఆటో కి నిప్పు పెట్టడంతో ఆటో డ్రైవర్లు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఈ సీన్ ను సీరియల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ సీన్ ను డిలీట్ చేయకపోతే మొత్తం తగలబెట్టేస్తాం అంటూ ఆటో డ్రైవర్లు సీరియస్ గానే కామెంట్స్ లో వార్నింగ్ ఇస్తున్నారు.
End of Article