Ads
ఆ అమ్మాయి పేరు ప్రియాన్షు కుమారి. బీహార్ కు చెందిన ఈ అమ్మాయి తన చిన్నతనం లోనే తండ్రిని పోగొట్టుకుంది. ఆమె తల్లి కాయ కష్టం చేసుకుని పెంచి పెద్ద చేస్తోంది. ఆమెను పదవ తరగతి వరకు చదివించింది. ప్రియాన్షు కుమారి కూడా తల్లి బాధని అర్ధం చేసుకుని కష్టపడి చదువుకుంది.
Video Advertisement
పదవ తరగతిలో మంచి మార్కులను సొంతం చేసుకుంది. పదవ తరగతి పరీక్షల్లో 472 మార్కులు సాధించి బీహార్ లో టాపర్ గా నిలిచింది. ఎంతో కష్టపడి చదువుకునే ఆమెను చూసి ఆ ఊరి ప్రజలు ముచ్చట పడేవారు.
అయితే.. పదవ తరగతి తరువాత ఆమెను చదివించడానికి ఆమె తల్లికి ఆర్ధిక కష్టాలు ఎదురయ్యాయి. దీనితో.. ఆ ఊరి ప్రజలే ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మొదట సంతోష్ కుమార్ అనే ఓ మాజీ సైనికుడు ఆమెకు సాయం చేయడం కోసం ముందుకు వచ్చాడు. ఆమె చదువుకు ఆర్ధికంగా సాయం అందిస్తానని చెప్పాడు. అతనితో పాటు మరి కొందరు కూడా చేతులు కలిపారు.
వీరందరూ కలిసి ఓ కమిటీ గా ఏర్పడి చందాలు పోగేసుకున్నారు. ప్రియాన్షు కుమారి బాగా చదువుకోవాలని.. ఆమె చదువుకోవడానికి అయ్యే ఖర్చుని తామే భరిస్తామని ముందుకొచ్చారు. ఆమె చదువు పూర్తి అయ్యే వరకు ఆ బాధ్యత మాదేనని ప్రకటించారు. ఇంట్లో అన్ని వసతులు ఉండి చదువుకోమంటేనే చాలా మంది పిల్లలు మొండికేస్తూ ఉంటారు. అలాంటి రోజుల్లో.. ఇంత చక్కగా చదువుకుంటున్న ప్రియాన్షు కుమారి స్టోరీ అందరికి స్ఫూర్తిదాయకం కదా.
End of Article