యూట్యూబ్ లో పాఠాలు చదివి అమెజాన్ లో 40 లక్షల ప్యాకేజ్ కొట్టేసింది.. ఈమె స్టోరీ తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

యూట్యూబ్ లో పాఠాలు చదివి అమెజాన్ లో 40 లక్షల ప్యాకేజ్ కొట్టేసింది.. ఈమె స్టోరీ తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

by Anudeep

Ads

ఈరోజుల్లో ఉద్యోగం దొరకడం అంటే అంత ఈజీ ఏమీ కాదు. డిగ్రీలతో పాటు ఎన్నో కోర్స్ లు చేసి వాటి సర్టిఫికెట్స్ ను చూపించినా టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు రాక నిరుద్యోగులుగా మారుతున్న వారు ఎందరో ఉండిపోతున్నారు. కానీ..అలాంటి వారిలో భావన చాలా ప్రత్యేకం. టాలెంట్ ఉండీ, అవకాశాలు లేకపోవడం వలన ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె ఎదుర్కొన్న పరాభవాలు మరొకరికి ఎదురైతే వారు భవిష్యత్ పైనే ఆశ వదిలేసుకుంటారు.

Video Advertisement

 

కానీ, భావన అలా చేయలేదు. పట్టు మరింత బిగించి కోరుకున్న ఉద్యోగం దక్కే వరకూ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అసలు ఆమె స్టోరీ నే ఓ జీవిత పాఠం. ఎందరో నిరుద్యోగులకు ఆమె ఆదర్శ ప్రాయం. ఆమె స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. భావన డిగ్రీ మాత్రమే చదువుకున్నారు. బిటెక్ చేయలేదు. డిగ్రీ కూడా కనీసం కంప్యూటర్ కోర్స్ బ్యాక్ గ్రౌండ్ తీసుకోలేదు. దీనితో ఆమెకు చాలా ఇంటర్వ్యూలలో పరాభవాలే ఎదురయ్యాయి. బి టెక్ చదవలేదని, ఇంగ్లీష్ సరిగ్గా రాలేదని, కంప్యూటర్ బ్యాక్ గ్రౌండ్ లేదనీ.. ఇలా పలు కారణాల వలన ఆమె ఇంటర్వ్యూలలో వెనుదిరిగి వస్తుండేది. కనీసం ట్రైనీగా కూడా తీసుకోలేమని మల్టీ నేషనల్ కంపెనీలు చెప్పడంతో ఆమె కుంగిపోలేదు.

bhavana 1

భద్రాది కొత్తగూడెం జిల్లా మణుగురు మండలం కు చెందిన భావన డిగ్రీ చదువుకుంటున్న రోజుల నుంచే పట్టుదలతో చదువుకుంది. భావన కు పెద్ద ప్రభుత్వ ఆఫీసరు అవ్వాలనే కల ఉండేది. అందుకోసం బిటెక్ ను కాకుండా డిగ్రీని ఎంచుకుంది. కానీ కరోనా ఆమె కలలపై నీళ్లు చల్లింది. క్లాసులు సరిగ్గా జరగకపోవడం, బయటకు వెళ్లే అవకాశం కూడా లేకపోవడంతో భావనలో దిగులు మొదలైంది. ఈ క్రమంలో డిగ్రీ పూర్తి అయ్యాక సివిల్స్ కు ప్రిపేర్ అవ్వడానికి మరో రెండేళ్లు పెట్టె అవకాశం ఉంది. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు.

bhavana 2

అందుకే భావన తన ప్లాన్ ను చేంజ్ చేసుకుంది. డిగ్రీ అవగానే ఉద్యోగం చేయాలనీ, తల్లి తండ్రులకు భారం కాకూడదని నిర్ణయించుకుంది. అందుకోసం స్కిల్స్ పెంచుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు లాక్ డౌన్ ను అవకాశంగా వినియోగించుకుంది. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లపై దృష్టి పెట్టింది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ను నేర్చుకుంది. అందుకోసం లాప్ టాప్ ను తెలిసిన వాళ్ళ దగ్గర అరువు తెచ్చుకుని సి, సి ++, జావా లాంటి కోర్స్ లను యు ట్యూబ్ లలో వీడియోలు చూసి నేర్చుకుంది. ఫైనల్ ఇయర్ లో ఉండగానే రకరకాల కంపెనీలకు అప్లై చేయడం ప్రారంభించింది.

bhavana 3

అయితే అమెజాన్ లో ఉద్యోగం అంత ఈజీ గా రాలేదు. అసలు చాలా కంపెనీలు బి టెక్ లేని కారణంగా ఇంటర్వ్యూ నే రిజెక్ట్ చేసాయి. అమెజాన్ సంస్థ కూడా రాత పరీక్షకి కూడా పిలవలేదు. కానీ ప్రయత్నాలు ఆపలేదు. చివరకి మూడవసారి అమెజాన్ సంస్థ ఇంటర్వ్యూకి పిలిచింది. అలా ఐదు రౌండ్స్ వరకు కాన్ఫిడెన్స్ తో ఇంటర్వ్యూ ని పూర్తి చేసింది భావన. ఈ ఏడాది ఏప్రిల్ రెండవ తేదీన ఆమెకు అమెజాన్ సంస్థ ఆఫర్ లెటర్ ను పంపించింది. లండన్ లో ఉద్యోగం ఇస్తున్నామని, నలభై లక్షల ప్యాకేజ్ ను ఇస్తున్నామని ప్రకటించింది. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదంటూ భావన నిరూపించింది కదా.. ఆమెను మనమందరం ఇన్స్పిరేషన్ గా తీసుకుందామా..


End of Article

You may also like