Ads
బుల్లితెర సూపర్ కమెడియన్ గా మరియు హీరోగా యాంకర్ గా అన్నీ కలిపిన ఉగాది పచ్చడిలా తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్. ఆయన జబర్దస్త్ లో తన కామెడీ స్కిట్స్ ఎక్కువగా అమ్మాయిల వెంట పడే జులాయిలా ఉంటాయి.
Video Advertisement
ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఎక్కువగా శృంగార ప్రియుడిగా చూపిస్తారు. పదిమందిని నవ్వించడం కోసం తనకు తానే తగ్గించుకుంటూ పంచెస్ వేయించుకుంటాడు సుడిగాలి సుధీర్. ఫాన్స్ ను ఎంటర్టైన్ చేయడం కోసం ఏమైనా చేస్తాను అంటూ సుడిగాలి సుధీర్ పలుసార్లు చెప్పిన సంగతి విదితమే.
చాలా సార్లు సుడిగాలి సుధీర్ తన రియల్ లైఫ్ పై కూడా పంచ్ లు వేయించుకుంటూ ఉంటారు. రీసెంట్ గా సుధీర్, రాంప్రసాద్, ఇమ్మాన్యూల్ తో పాటు కొందరు ఇతర కమెడియన్లు కూడా కలిసి జబర్దస్త్ లో ఓ స్కిట్ చేసారు. ఈ స్కిట్ చాలా సరదాగా ఉండడంతో బాగా వైరల్ అవుతోంది. జబర్దస్త్ లో సుధీర్ చేసే స్కిట్ లలో చాలా వరకు తనపైనే పంచ్ లు ఉంటాయి.
ఈ స్కిట్ లో కూడా సుధీర్ తనపై చాలానే పంచ్ లు వేయించుకున్నాడు. స్కిట్ లో సుధీర్ కు సినిమా అవకాశాలు వచ్చినట్లు చూపించారు. స్కిట్ లో భాగంగానే సుధీర్ కు ఇమ్మానుయేల్ ఓ స్టోరీ లైన్ చెబుతాడు. కానీ, ఆ లైన్ సుధీర్ కు నచ్చదు. దానితో సుధీర్ ఓ లైన్ ను చెబుతాడు. స్కిట్ చేసే సమయంలో పెర్ఫామెన్స్ నచ్చి పూర్ణ వచ్చి బుగ్గ కొరుకుతుందని.. లేదా నేనే ఆమె బుగ్గ కొరుకుతానని అంటాడు. తాను స్టోరీ లైన్ చెప్పిన మూడు సినిమాలు హిట్ అయ్యాయని అంటాడు.
ఈలోపు సుధీర్ కు ఫోన్ వస్తుంది. తాను నటించిన గాలోడు, కాలింగ్ సహస్ర సినిమాలు దూసుకెళ్తున్నాయని చెప్తాడు. దీనితో పక్కనే ఉన్న మరో ఆర్టిస్ట్ ఊరుకో అన్నా టీజర్ కూడా బాలేదు అని అనేస్తాడు. జబర్దస్త్ లో ఉంటె వర్క్ అవుట్ అవ్వదు అని.. ఇండస్ట్రీ కి వెళ్లాలని సుధీర్, రామ్ ప్రసాద్ అనుకుంటారు. అయితే.. ఏడాది తిరిగినా ఇద్దరికీ ఒక్క ఛాన్స్ కూడా దొరకదు. దీనితో ఒకరు సోడా బండి పెట్టుకున్నట్లు.. మరొకరు మొక్క జొన్న బండి పెట్టుకున్నట్లు చూపించి స్కిట్ ను ఎండ్ చేస్తారు.
End of Article