Ads
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా కూడా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఇందులో చిరంజీవి పక్కన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత వారిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండవ సినిమా ఇది.
Video Advertisement
రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడడం, అది కూడా ఇద్దరినీ ఫుల్ లెన్త్ రోల్ లో చూడడం అనే విషయం సినిమా మీద ఆసక్తిని ఇంకా పెంచింది.
ఈ సినిమా కోసం వేసిన ధర్మస్థలి సెట్ ప్రధాన ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ నెల 29 న విడుదల కానున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆచార్య సినిమా ధర్మస్థలి సెట్ గురించి చర్చ జరుగుతోంది. సినిమా స్టోరీలో భాగంగా ఈ సినిమాలో “ధర్మస్థలి” అనే టెంపుల్ టౌన్ ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ సెట్ వేశారు. దర్శకుడు కొరటాల శివ ఆలోచనకు అనుగుణంగా ఈ సెట్ ను రూపొందించారు.
మెగాస్టార్ కు చెందిన కోకాపేట ల్యాండ్ వద్ద ఈ సెట్ ను వేయించారు. పూర్తిగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ గా ఉన్న వాతావరణంలో ఈ సెట్ ను వేశారు. అలాగే.. “పాదఘట్టం” అనే మరో సెట్ ను కూడా అద్భుతంగా వేశారు. కొరటాల శివ ఆలోచనలకు తగ్గట్లే సెట్ వేశానని సురేష్ చెప్పుకొచ్చారు. గతంలో “భరత్ అనే నేను” సినిమాకు సెట్ వేశానని.. తాజాగా ఈ సినిమాలకు సెట్ వేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.
End of Article