Ads
ఒక స్టార్ హీరో సినిమా కి సంబంధించి ఈవెంట్ అయినా, చిన్న హీరో సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా యాంకర్ సుమ ఉండాల్సిందే. అటు బడా ఈవెంట్ల నుంచి మొదలు కొని బుల్లితెర పై షోల వరకు సుమ కనకాల ఉంటారు. ఆమె షెడ్యూల్ లో ఒక రోజు కూడా తీరిక లేకుండా ఉంటారు.
Video Advertisement
అచ్చ తెలుగుని గడగడా మాట్లాడేసే సుమని చూస్తే.. ఎవ్వరు ఆమెను కేరళ అమ్మాయి అని అనుకోరు. కేరళ అమ్మాయి అయిన యాంకర్ సుమ రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న తరువాత తెలుగు వారింటికి కోడలిగా వచ్చేసారు.
అంతే కాదు.. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ తెలుగు సినిమా అభిమానులకు మరింత చేరువయ్యారు. ఇక బుల్లితెరపై ఆమె చేసే సందడిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటె.. మరోవైపు ఆమెకు, ఆమె భర్త రాజీవ్ కనకాల మధ్య ఏవో గొడవలు ఉన్నాయని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడాకులు కూడా తీసేసుకుంటారేమో అన్నట్లు ఈ వార్తలు హల్ చల్ చేసాయి. తాజాగా.. యాంకర్ సుమ కనకాల ఈ వార్తలపై స్పందించారు.
ప్రస్తుతం జయమ్మ పంచాయితీ సినిమాలో నటిస్తున్న సుమ.. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ షో లో పాల్గొన్న సుమ రాజీవ్ కు తనకు మధ్య వచ్చిన గొడవల గురించి మాట్లాడారు. పెళ్ళై 23 సంవత్సరాలు అవుతోందని.. ఈ కాలంలో ఎన్నో సార్లు గొడవపడ్డామని, అయితే భార్యా భర్తలుగా విడాకులు తీసుకోవడం ఈజీనే కానీ.. తల్లి తండ్రులుగా విడిపోవడం మాత్రం సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. ఈ విషయాలు చెబుతూ సుమ ఎమోషనల్ అయిపోయారు.
End of Article