Ads
ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యామ్‌తో హీరో ప్రభాస్ బాగా ఎలివేట్ అయ్యారు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు.
Video Advertisement
బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ భారతదేశం అంతటా వ్యాపించింది. బహుశా ప్రభాస్ తెలియని ఇండస్ట్రీ ఉండదేమో. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న ఆదిపురుష్, సలార్ సినిమాలపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.
అయితే రాధేశ్యామ్ సినిమా ఆశించినంతగా ఫలితం సాధించకపోవడంతో ఫ్యాన్స్ కొంచం అప్ సెట్ అయ్యారు. మరోవైపు పాటలు మాత్రం కొంతమేరకు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొన్ని సీన్లు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినప్పటికీ.. బలమైన కథనం ఆకట్టుకునే స్క్రీన్ ప్లే లేకపోవడం కొంత మైనస్ అయ్యాయి. మరోవైపు, హస్త సాముద్రికం అనే టాపిక్ కూడా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఏమి కాకపోవడం మరో మైనస్ అయ్యింది.
ఇది ఇలా ఉంటె.. ఈ సినిమాలో విడుదల అయిన ఓ సాంగ్ ఓ పాత సినిమా నుంచి కాపీ కొట్టారు అంటూ సోషల్ మీడియాలో తమన్ పై ట్రోల్స్ నడుస్తున్నాయి. ఓ పాట లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను మరో పాత సినిమా పాట నుంచి కాపీ చేసారు అని కామెంట్స్ చేస్తున్నారు. రాధేశ్యామ్ లోని నిన్నేలే సాంగ్ లో మధ్యలో ఒక చోట వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ “అభిమన్యుడు” సినిమాలోని ” ఆకేసి, పప్పేసి, బువ్వేసి..నెయ్యేసి.. నీకో ముద్దా, నాకో ముద్దా…” అంటూ సాగే పాటలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లా ఉంటుంది. దీనితో ఈ సాంగ్ మ్యూజిక్ కూడా కాపీనేనా అంటూ తమన్ ని ప్రశ్నిస్తున్నారు.
Watch Video:
https://www.youtube.com/watch?v=sPe3iS7wjyA
End of Article