Ads
సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో మహేష్ బాబుతో పాటు, హీరోయిన్ అయిన కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, అలాగే సముద్రఖనితో పాటు ముఖ్య పాత్రల్లో నటించిన సుబ్బరాజు, నదియా, తనికెళ్ల భరణి కనిపిస్తున్నారు. సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్‌లో మహేష్ బాబు చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు.
Video Advertisement
ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. ఇందులో యాక్షన్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అని తెలుస్తోంది. ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో నటిస్తున్నారు.
సినిమా ఎలా ఉండబోతోందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి గీత గోవిందం, సోలో సినిమాలకి దర్శకత్వం వహించిన పరశురామ్ దర్శకత్వం వహించారు. చాలా సంవత్సరాల తరువాత తమన్, మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు. సర్కారు వారి పాట ఎప్పుడో విడుదల కావాలి. కానీ కోవిడ్ కారణంగా అలస్యమైంది. ఇప్పుడు మేలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే ఇతర పెద్ద సినిమాలు కూడా ఇప్పటికే రిలీజ్ అయిపోయి వాటి హవా తగ్గిపోవడం కూడా సర్కారు వారి పాట సినిమాకి ప్లస్ పాయింట్ కాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ఒక్క గండం మాత్రం ఉంది. ఈ సినిమా విడుదల అయ్యే టైం కి రెండు తెలుగు రాష్ట్రాలలోను పరీక్షలు జరగనున్నాయి. ఆ సమయంలో చాలా వరకు ఫ్యామిలీస్ మూవీ ని అవాయిడ్ చేసే అవకాశం ఉంది. ఈ గండం గట్టెక్కితే మాత్రం సర్కారు వారి పాట సినిమా కలెక్షన్లు సృష్టించే అవకాశం ఉంది.
అయితే ఈ సినిమా సమ్మర్ సీజన్లో విడుదల అవుతుంది కాబట్టి అది కూడా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. మరో వైపు దర్శకుడు పరశురామ్, ఇతర టెక్నిషియన్లు, కీర్తి సురేష్ పలు ఇంటర్వూస్ లో పాల్గొంటూ ఈ సినిమాకు హైప్ తీసుకొస్తున్నారు. మరో వైపు సోషల్ మీడియాలో కూడా మహేష్ బాబు లుక్స్ కు ప్రశంసలు లభిస్తున్నాయి.
End of Article