హీరో రామ్ పోతినేని చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారని తెలుసా..? ఇంతకీ ఆ సినిమా ఏదంటే?

హీరో రామ్ పోతినేని చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారని తెలుసా..? ఇంతకీ ఆ సినిమా ఏదంటే?

by Anudeep

Ads

టాలీవుడ్ హీరో పోతినేని రామ్ ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రామ్ కు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సొంతంగా తన కాళ్లపై తాను నిలబడుతూ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. క్లాస్, మాస్ తేడా లేకుండా తనదైన శైలిలో యాక్టింగ్ లో ఇరగదీసేస్తూ దూసుకెళ్తున్నారు.

Video Advertisement

అందరికి తెలిసిన విషయం ఏంటంటే.. ఎనర్జిటిక్ హీరో రామ్ టాలీవుడ్ లోకి 2006 లో “దేవ దాసు” సినిమాతో ఎంట్రీ ఇచ్చారు అని. వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అప్పటికి రామ్ వయసు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే.

ram pothineni 1

కానీ.. ఈ సినిమా కంటే ముందే రామ్ మరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. యాక్టింగ్ తో పాటు ఎనర్జిటిక్ స్టయిల్ లో డాన్స్, ఫైట్స్ ఇరగదీసే రామ్ చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. అయితే రామ్ నటించింది తెలుగు సినిమాలో మాత్రం కాదు. ఓ తమిళ సినిమాలో రామ్ బాల నటుడిగా నటించి అందరి మెప్పుని పొందారు.

ram pothineni 2

“అదయాలం” అనే ఓ తమిళ షార్ట్ ఫిలిం లో రామ్ నటించారు. ఈ సినిమాలో నటించేటప్పటికి రామ్ కు కేవలం 11 సంవత్సరాల వయసు మాత్రమే ఉంది. ఈ సినిమాలో రామ్ నటనకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా లభించింది. ఓ పర్సనల్ ఇంటర్వ్యూ లో రామ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. పడుతూ లేస్తూ నిలదొక్కుకున్న రామ్ కెరీర్లో హిట్ సినిమాలతో పాటు, ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. “నేను శైలజ” లాంటి ఫీల్ గుడ్ మూవీస్ ఉన్నాయి. “ఇస్మార్ట్ శంకర్” లాంటి పక్కా మాస్ సినిమాలు కూడా ఉన్నాయి. భిన్నమైన సెలక్షన్ తో రామ్ ముందుకెళ్తున్నారు.

Watch Video:


End of Article

You may also like