Ads
బౌలింగులో బెంగళూరుకు అడ్డుకట్ట వేయలేకపోయింది. చేజింగ్ లోనైనా మెరుస్తారు అనుకుంటే చేతులెత్తేసారు. కనీస పోటీ కూడా ఇవ్వకుండా ఆల్ అవుట్ అయి ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. బెంగళూర్ లో జరిగినటువంటి మ్యాచ్ లో హైదరాబాద్ వరుసగా నాలుగో ఓటమి పాలై ప్లే ఆప్స్ ఆశలను మరింత కష్టతరం చేసుకుంది. ఇక మిగిలింది మూడు మ్యాచ్ లే.. అందులో విజయం సాధిస్తే ప్లే ఆప్స్ ఛాన్స్.. మరోవైపు ఈ విజయంతో బెంగళూరు ప్లే ఆప్స్ కు మరింత దగ్గరకు చేరుకుంది. ఇంకొక మ్యాచ్ లో గెలిస్తే ఆర్సిబి నాకౌట్ దశకు చేరుకోవడం తద్యం..
Video Advertisement
ఇందులో ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు బ్యాటర్లు హైదరాబాద్ పై చెలరేగారు. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆర్ సి బి 192 పరుగుల భారీ స్కోరు ను సాధించింది. ఓపెనర్ గా వచ్చిన కోహ్లీ (0) మొదటి ఓవర్లో తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయి పెవిలియన్ చేరాడు. సుచిత్ బౌలింగ్లో విలియంసన్ వేసిన గత రెండు మ్యాచుల్లో టచ్ లోకి వచ్చినట్లే వచ్చి కనిపించిన కోహ్లీ మరోసారి నిరాశ పరిచాడు. ఈ సీజన్లో కోహ్లీ డక్ ఔట్ కావడం ఇది మూడోసారి.
అయితే మరో ఓపెనర్ కెప్టెన్ డూప్లిసేస్ (73 నాటౌట్ ) అజయ ఇన్నింగ్స్ తో సత్తా చాటారు. రాజాత్ పాటిదార్ (48), మ్యాక్స్వెల్ (33) సైతం అతడితో కలిసి దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత వికెట్ ఈ 10 దినేష్ కార్తీక్ (30 నాటౌట్ ) మరోసారి మెరుపులు మెరిపించారు. ఎనిమిది బంతుల్లో నాలుగు సిక్స్ లూ, ఒక ఫోర్ తో 30 పరుగులు చేసాడు. దీంతో హైదరాబాద్ ముందు బెంగళూరు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
End of Article