“ఏ మాయ చేసావే” నుండి “పుష్ప” వరకు… “మహేష్ బాబు” రిజెక్ట్ చేసిన 8 సూపర్‌హిట్ సినిమాలు..!

“ఏ మాయ చేసావే” నుండి “పుష్ప” వరకు… “మహేష్ బాబు” రిజెక్ట్ చేసిన 8 సూపర్‌హిట్ సినిమాలు..!

by Anudeep

Ads

కొన్ని సార్లు మన తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు ఒక హీరోను అనుకుని మరొక హీరోతో చేస్తూ ఉంటారు. కాల్ షీట్స్ సెట్ అవ్వకో లేక కథ నచ్చకో గాని ఆ సినిమాలను వదిలేస్తూ ఉంటారు.

Video Advertisement

వారు వద్దనుకుని వదిలేసిన ఆ చిత్రాలే సూపర్ డూపర్ హిట్ అని సాధిస్తూ ఉంటాయి.

Mahesh-babu

అలా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వదులుకున్న ఎన్నో చిత్రాలు సక్సెస్ ను సాధించాయి. మరి ఆ చిత్రాలు ఏంటో ఒకసారి చూద్దాం రండి. 

#1.గజిని :

సూర్య హీరోగా నటించిన గజినీ మూవీ అప్పటిలో ఎంత హిట్ అయిందనే విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా మహేష్ బాబుతో చేయాలని అనుకున్నారట. మహేష్ బాబు వేరే సినిమాలో బిజీగా ఉండటంతో గజినీ సినిమాకి నో చెప్పారట.

#2.వర్షం :

మాస్ ఫాలోయింగ్ తో వర్షం చిత్రం అప్పట్లో ప్రభాస్ కి మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను సాధించింది. ముందు ఈ చిత్రానికి గానూ మహేష్ బాబు హీరోగా అనుకోగా ఆయన డేట్స్ ఖాళీ లేక ప్రభాస్ ను వరించింది వర్షం చిత్రం.

#3. 24 :

24 చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయంతో  వినూత్న ప్రయత్నంతో అప్పటిలో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. కొత్త కథతో రిస్క్ ఎందుకని మహేష్ బాబు అప్పటిలో ఈ సినిమాకి నో చెప్పేశారట.

#4. ఏ మాయ చేసావే :

అప్పటిలో మంచి సక్సెస్ను సాధించిన యూత్ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఏ మాయ చేసావే చిత్రంలో నాగచైతన్యకు మహేష్ బాబుని తీసుకుందాం అనుకున్నారట. వేరే సినిమాలో బిజీగా ఉండడంతో మహేష్ ఈ సినిమాకి నో చెప్పేశారట.

#5. అఆ :

త్రివిక్రమ్ మరియు నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. మొదట్లో ఈ సినిమా కోసం మహేష్ బాబు ను సంప్రదించగా కారణం తెలియదు గానీ ఆయన ఎందుకో నో చెప్పారట.

#6. లీడర్ :

దగ్గుబాటి రానా తొలి చిత్రంగా పరిచయమైనా లీడర్ లో హీరోగా మొదట మహేష్ బాబుని అనుకున్నారంట శేఖర్ కమ్ముల. అప్పటికే మహేష్ బాబు మరో సినిమాతో బిజీగా ఉండడంతో ఈ చిత్రం రాణాను వరించింది.

#7. పుష్ప :

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప చిత్రంలో కుమార్, అల్లు అర్జున్ కన్నా ముందు మహేష్ బాబుని సంప్రదించారట. తనకి మాస్ లుక్ సెట్ కాదని పుష్ప చిత్రానికి మహేష్ బాబు నో చెప్పారట.

#8. యానిమల్:

ఫస్ట్ లో సందీప్ రెడ్డి వంగా తన రాబోయే చిత్రం ‘యానిమల్’లో ప్రధాన పాత్రను మహేష్ బాబుకు ఆఫర్ చేశాడు అంట… కానీ మహేష్ బాబు ఆ రోల్ లోని పాత్ర చీకటి స్వభావం తనకి సెట్ అవ్వదు అంటూ రిజెక్ట్ చేసారు అంట. తర్వాత రష్మిక మందన్నతో కలిసి నటించబోతున్న రణబీర్ కపూర్‌కు ఈ పాత్రను ఆఫర్ చేశారు.

అలా మహేష్ బాబు వద్దనుకుని వదులుకున్న ఈ చిత్రాలు విజయాన్ని సాధించాయి.


End of Article

You may also like