Ads
ప్రస్తుతం సర్కారు వారి పాట డైరెక్టర్ పరశురామ్ పేరు మారుమ్రోగిపోతోంది. డైరెక్టర్ పరశురామ్ నిఖిల్ హీరోగా వచ్చిన “యువత” సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని నేడు స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు.
Video Advertisement
డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు సొంత బాబాయ్ కొడుకే పరశు రామ్. డైరెక్టర్ పరశురామ్ కెరీర్ ప్రారంభంలో పూరి జగన్నాధ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. పరశురామ్ తండ్రి కో-ఆపరేటివ్ బ్యాంకు లో పని చేసారు.
వారికి ఓ పౌల్ట్రీ ఫామ్ ఉండేది. ఆ వ్యవహారాలన్నీ పరశురామ్ తల్లి చూసుకునేవారు. ఓ సారి ఓ వైరస్ సోకడంతో పౌల్ట్రీ ఫామ్ లోని కోళ్ళన్నీ చనిపోయాయి. వారికి చాలా నష్టమే వచ్చింది. అప్పటివరకు పరశురామ్, ఆయన సోదరి ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీయే చేస్తున్న రోజులలో పరశురామ్ తల్లికి ఒంట్లో బాలేదని ఫోన్ వస్తే ఇంటికి వెళ్ళాడు. డాక్టర్లు హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని చెప్పేసరికి తన స్నేహితులతో కలిసి రక్తం ఇచ్చి తిరిగి వచ్చేసాడు.
మరో పదిరోజులకు నీరసంగా ఉందంటూ మళ్ళీ ఫోన్ వచ్చింది. చివరకు పరీక్షలు చేస్తే ఎక్యూట్ బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని, రెండు మూడు నెలలకంటే బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. ఈ విషయాన్నీ సోదరికి కానీ, తండ్రికి కానీ చెప్పలేకపోయాడు. ఓ పది రోజులు గడిచాక తండ్రికి పరిస్థితి వివరించాడు. ఎన్ని ఆసుపత్రులలో చూపించినా ఆవిడ పరిస్థితి మెరుగవలేదు. జబ్బు ఉందని బయటపడిన ఆరునెలలకు ఆమె మరణించారు. ఆ తరువాత ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చిన పరశురామ్ దర్శకుడు పూరి జగన్నాధ్, దశరథ్ ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసి, సొంతంగా సినిమాలు డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగాడు.
End of Article