Ads
పుష్ప, కే జి ఎఫ్, RRR వంటి చిత్రాలు పాన్ ఇండియా చిత్రాల స్థాయిలో రిలీజ్ అయ్యి మన టాలీవుడ్ రేంజ్ ను పెంచేశాయి. గత కొంత కాలంగా నార్త్ లో మన సౌత్ సినిమాల రేంజ్ మరియు మన స్టార్స్ రేంజ్ విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు. మన సౌత్ సినిమాల రిలీజ్ కోసం హిందీ సినిమా థియేటర్లు ఓనర్ లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
Video Advertisement
ఇప్పుడు బాలీవుడ్ మరియు టాలీవుడ్ చిత్రాల వర్గాలవారు ఒకే స్క్రీన్ షేర్ చేసుకోవడంతో రూట్ క్లియర్ అయిందని చెప్పవచ్చు. వీరు కలిసి నటించిన చిత్రాలు పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నాయి. ఇప్పటి లో ఇంత క్రేజ్ సంపాదించుకున్నా మన స్టార్స్ తో ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ కలిసి నటించడానికి అంగీకరించలేదు.
2013 టైంలో అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించడానికి మన సౌత్ నిర్మాతలు అనుష్క శర్మను సంప్రదించినప్పుడు, ఆశ్చర్యంగా ఆవిడా మన సౌత్ స్టార్స్ తో నటించడానికి నిరాకరించింది. ఇదే కోవలో మన స్టార్స్ తో నటించడానికి నిరాకరించిన వారిలో కత్రినా కైఫ్, దీపికా పదుకొనే మరియు సోనం కపూర్ కూడా ఉన్నారు.
బాలీవుడ్ బ్యూటీస్ మన సౌత్ స్టార్స్ తో సినిమాలు కలిసి నటించడానికి కారణాలు లేకపోలేదు. బాలీవుడ్ లో అధిక రెమ్యునేషన్ అందుకున్న వీరు, మన సౌత్ సినిమాల్లో నటించడం వలన మన నిర్మాతలు తక్కువ రెమ్యునరేషన్ ఇస్తారనే అపోహతో మన స్టార్స్ తో సినిమాని నిరాకరిస్తున్నారు.
End of Article