Ads
భారతదేశంలో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఎంతమంది ఉన్నా అందులో టాటాలది మాత్రం ఒక ప్రత్యేకమైన మార్క్ ఉంటుంది. వారు ఏ పని చేసిన లాభాలే లక్ష్యంగా మాత్రం పెట్టుకోరు. అందులో కొంత హ్యూమన్ టచ్ తప్పనిసరి ఉంటుంది. అది మొదటి నుంచి టాటాలకు ఉన్నటువంటి అలవాటు. అదే ఒరవడిలో మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న టువంటి బాధను తీర్చేందుకే నడుంకట్టారు టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా. ఈ ప్రయత్నం నుండి వచ్చినది టాటా నానో వాహనం..
Video Advertisement
ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ కి రతన్ టాటా ఈ నానో కార్ లోనే వచ్చారు. ముంబై లోని తాజ్ హోటల్ కు రతన్ టాటా ఈ నానో కార్ లో రావడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.
అయితే.. భారత దేశపు అత్యధిక ధనికుల్లో ఒకరైన టాటా ఇలా నానో కార్ లో రావడం వెనుక ఆయన ఔన్నత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఇలా రావడం వెనుక ఓ కారణం ఉండే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. నిజానికి నానో కారు రతన్ టాటా కలల ప్రాజెక్ట్. పెద్ద కార్లను కొనుక్కోలేని మధ్య తరగతి వ్యక్తుల సౌకర్యం కోసం ఆయన ఏదైనా చేయాలనుకున్నారు. ఆ కలల్లోంచి పుట్టుకొచ్చిందే ఈ నానో కార్. అయితే ఈ టాటా నానో ఎలక్ట్రిక్ కార్ తొందరలోనే మార్కెట్ లోకి రాబోతోంది.
సామాన్య ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. ఈ కార్ ను టాటా మోటర్స్ తయారు చేయలేదు. ఇది ఒక కస్టమ్ మేడ్ టాటా నానో ఎలక్ట్రిక్ కార్. ఎలక్ట్రిక్ వాహనాల కోసం పవర్ ట్రైన్ సొల్యూషన్స్ ను తయారు చేసే ElectraEV సంస్థ ఈ కార్ ను రతన్ టాటా కు బహుమతిగా ఇచ్చింది. టాటా చేతుల మీదుగానే ఈ కంపెనీ ప్రారంభమైంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం పుణేలో ఉంటె.. కోయంబత్తూర్ లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఉంది. ఈ కార్ 150 మైలేజీను ఇస్తుంది. 624cc పెట్రోల్ ఇంజన్ తో ఎలక్ట్రిక్ వాహనంగా ఈ కార్ ను రూపొందించారు. ఈ కార్ కు బాటరీ బ్యాకప్ తో పాటు 72V పవర్‌ట్రెయిన్ కూడా ఇవ్వబడింది. పది సెకన్లలో 0 – 60 కి.మీ వేగాన్ని అందుకోగలదు.
ARAI మరియు RTO సర్టిఫికేట్ పొందిన ఈ కార్ ను రతన్ టాటాకు బహుమతిగా ఇవ్వడంతో ఆయన ఈ కార్ లోనే వచ్చి అందరిని షాక్ కి గురి చేసారు. అయితే.. రతన్ టాటా ఈ కార్ ను ప్రమోట్ చేయడం కోసమే ఇలా అందరిముందు తీసుకొచ్చారు అన్న అనుమానాలు కూడా చాలామందికి వచ్చాయి. ఎలక్ట్రిక్ నానో కార్ త్వరలోనే మార్కెట్ లోకి రాబోతోందని అందరు భావిస్తున్నారు.
End of Article