Ads
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బెంగళూరు అద్భుత విజయం సాధించింది. చివరి వరకు పోరాటం చేసిన లక్నో విజయానికి దూరమై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Video Advertisement
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో బుధవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో పై బెంగళూరు జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు లక్నో ముందు భారీ టార్గెట్ పెట్టింది. యువ బ్యాటర్ రాజత్ పాటిదర్ (112) అజేయ సెంచరీతో చెలరేగడంతో చివర్లో కార్తీక్ (35 నాటౌట్ ) మెరుపులతో నిర్ణీత ఓవర్లలో 207 పరుగులు చేసింది. ఇక లక్ష్యాన్ని లక్నో సాధించేలా కనిపించిన చివరికి వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది.

కెప్టెన్ రాహుల్ (79), దీపక్ హుడా (45) పోరాడినా ఫలితం దక్కలేదు. ఆర్ సి బి ప్లేయర్ రజత్ పాటిదర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సిబి నాలుగు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఆరంభంలోనే కెప్టెన్ డూప్లిసెస్ (0)ను అవుట్ చేసి మొహ్సిన్ ఖాన్ బెంగళూరుకు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదర్ .. కోహ్లీతో కలిసి జట్టును ఆదుకున్నారు. విరాట్ నిదానంగా ఆడుతూ.. స్ట్రైక్ రోటెడ్ చేయగా.. పాటిదర్ చెలరేగి పోయాడు. ఈ సందర్భంలో ఒత్తిడికి గురైన కోహ్లీ (25) ఆవేశ్ ఖాన్ బౌలింగులో సిక్సర్ కోసం ప్రయత్నించి క్యాచ్ అవుట్ అయ్యారు. ఈ విధంగా లక్నో బెంగళూరు ఘన విజయం సాధించింది.
#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20

#21

#22

#23

#24

#25

End of Article
