Ads
భార్య భర్తల బంధం అనేది ఒక సున్నితమైన అనుబంధం. మట్టి కుండకు చిన్నరాయి తగిలితే ఎలా ముక్కలై పోతుందో, అలానే భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న సమస్యలను పెద్దగా చేసుకోవడం వలన సంసార జీవితం కూడా అలాగే ముక్కలై పోతుంది.
Video Advertisement
కోపం అనేది ఒక ప్రమాదకరమైన ఆయుధం. కోపంలో మనిషి తను మర్చిపోయి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డవచ్చు. జీవిత భాగస్వామి ఎందుకు ఆవేశాలకు లోనవుతున్నారని విషయంపై మీరు అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అది భార్య అయినా కావచ్చు భర్త అయినా కావచ్చు.
వారి ఆవేశానికి అసలు కారణం ఏంటి అనేది తెలుసుకోవడం చాలా మంచిది. ఈ టిప్స్ అనుసరించడం ద్వారా మీరు మీ భాగస్వామిని మీ వైపు తిప్పుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం రండి
#1 మౌనం:
మితిమీరిన కోపంతో మీ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే మౌనం తో సమాధానం చెప్పండి. మీ మౌనంతో వాళ్లలో పశ్చాత్తాపం కలుగుతుంది. ఆవేశంలో తప్పుగా మాట్లాడేనే అనే ఆలోచనలో పడతారు.
#2. జీవిత భాగస్వాములు కలసి ఆలోచించటం :
కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని జీవిత భాగస్వాములు ఇద్దరూ కలిసి ఆలోచించాలి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలో ఇద్దరికి ఒక అవగాహన ఉంటుంది. ఎలాంటి పెద్ద సమస్య అయిన పరిష్కరించుకునే శక్తి కలుగుతుంది.
#3. సరైన సూచనలు ఇవ్వటం :
మీ జీవిత భాగస్వామి ప్రతి విషయంలో ఏదో ఒక నెపంతో అరుస్తూ ఉంటే దానికి గల కారణాలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆర్ధిక ఇబ్బందా, పని ఒత్తిడి వలన, అనారోగ్య సమస్య లేక మరే ఇతర కారణాల వల్ల అయినా సతమతమవుతున్నారా అనే విషయం తెలుసుకోండి. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో అనేది నీకు తెలిసినంత వరకు సూచించండి.
#4. ధ్యానం చేయుట ద్వారా :
రోజుకు ఒక గంట సేపు అయినా మీరు మీ భాగస్వామి ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ధ్యానం చేయడం ద్వారా కోపావేశలను అదుపులోకి పెట్టుకోవచ్చు.
పైన చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవడం ద్వారా మీరు మీ జీవిత భాగస్వామి అన్యోన్యంగా మెలుగుతారు.
Also Read: శ్రీదేవిని’ వివాహం చేసుకోవాలనుకున్న మన తెలుగు స్టార్స్ వీరేనా ?
ప్రతి పురుషుడు తన భార్య పిల్లల ముందు చేయకూడని 3 పనులు
End of Article