రియల్ స్టోరీ: ఫుడ్ డెలివరీ ఏజెంట్ నుంచి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వరకు.. ఈ కుర్రాడి స్టోరీ తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

రియల్ స్టోరీ: ఫుడ్ డెలివరీ ఏజెంట్ నుంచి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వరకు.. ఈ కుర్రాడి స్టోరీ తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

by Anudeep

Ads

విశాఖపట్నానికి చెందిన ఒక యువకుడు డెలివరీ బాయ్ గా పని చేస్తూ చదువు కొనసాగించాడు. ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా మంచి ఉద్యోగం సంపాదించాడు. పనిచేస్తూ చదువుకోవడం అనేది చిన్న విషయమేమీ కాదు. ఏ పని చేయకుండానే చదువుకోడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఈ తరం యువతకు ఇతడు ఒక ఆదర్శం అని చెప్పవచ్చు.

Video Advertisement

తనకు ఎలా ఏ విధంగా సాధ్యమయిందో అనే విషయాన్ని తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో వివరించాడు. తాను కాలేజీలో చదివే సమయంలో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండేది కాదు. నాన్న ఒక కాంట్రాక్టు ఉద్యోగి. ఆయన తెచ్చే సంపాదన ఇంటి ఖర్చులకు కూడా సరిపోయేది కాదు. నేను నా వంతు సాయం చేద్దామని డెలివరీ ఏజెంట్ గా పనిలో చేరాను.

Food delivery boy to software engineeri

షేక్ అబ్దుల్ సత్తార్ ఆంధ్రరాష్ట్రం విశాఖనగరంలో ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేశాడు. తర్వాత శ్రీ గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు.

ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి12 గంటల వరకూ  వార్తలు డెలివరీ బాయ్ గా పని చేసేవాడిని, దీని ద్వారా నేను సంపాదించిన డబ్బుని ఇంటి అవసరాలకు మరియు నా చదువు నిమిత్తం ఉపయోగించే వాడిని అని తన లింక్డ్ఇన్ పోస్ట్ లో వివరించాడు.

ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఉంచాల్సిన స్థాయి నుండి  నా తల్లిదండ్రుల అప్పులు తీర్చగలిగే స్థాయికి ఎదిగాను. నా జీవితాన్ని ఇంత శక్తివంతంగా మార్చినందుకు NxtWave కి కృతజ్ఞుడను అని తన లింక్డ్ఇన్ పోస్ట్  ద్వారా వివరించాడు.

source: linkedin


End of Article

You may also like