Home Filmy Adda 26/11 దుర్ఘటనలో ఎంత మంది హీరోలు… కానీ “సందీప్ ఉన్నికృష్ణన్” ఎందుకు స్పెషల్ అంటే?

26/11 దుర్ఘటనలో ఎంత మంది హీరోలు… కానీ “సందీప్ ఉన్నికృష్ణన్” ఎందుకు స్పెషల్ అంటే?

by Anudeep

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ మేజర్. పాన్ ఇండియా మూవీగా మేజర్ చిత్రం రూపొందింది. చిత్రం 26/11 ముంబై దాడుల్లో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా చిత్రీకరించబడింది.

ఈ చిత్రం మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా, ఏ ప్లస్ ఎస్ మూవీస్ నిర్మాణ సారథ్యంలో జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్స్ తో మంచి టాక్ ను సంపాదించుకుంది. మేజర్ చిత్రం 2008లో జరిగిన ముంబై దాడుల్లో మరణించిన సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కనుందని తెలిసిన విషయమే. అయితే ముంబై దాడిలో ఉన్నికృష్ణన్ తో పాటు ఎంతోమంది సైనికులు మరణించారు. కానీ సందీప్ ఉన్నికృష్ణన్ మీద మాత్రమే ఎందుకు బయోపిక్ తీశారని అందరిలో ప్రశ్నలు తలెత్తాయి.

major movie review

ఈ విషయంపై దర్శకుడు శశి కిరణ్ తిక్క క్లారిటీ ఇచ్చారు. “సహజంగా ఇన్స్పిరేషన్ అనేది ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది ఉంటారు కానీ దృష్టి అనేది ఒకపైనే పడుతుంది. శేష్ లుక్ కి సందీప్ పాత్ర చాలా దగ్గరగా ఉంది. అలా అని మిగతా వారు తక్కువ అని నేను అనడం లేదు. ముందు ముందు ఫిల్మ్ మేకర్స్ వాళ్ళ బయోపిక్ పైన కూడా చిత్రాలు నిర్మించవచ్చు .”

Sasi kiran tikka

బయోపిక్ అనేది అందరూ ఇష్టపడి చేయవలసిన చిత్రం. సందీప్ కుటుంబం వారు మాకు ఈ బయోపిక్ కు సంబంధించి ఎంతో  సహకరించారు. అతని అలవాట్లు మరియు హావభావాలు ఎలా ఉంటాయి అనే విషయంపై వారి మాకు పూర్తి సహకారం ఇచ్చారు.

Major movie image

“ఆయన కుటుంబ సహకారం లేనిదే ఈ బయోపిక్ కి మేము తీయగలిగే వాళ్ళం కాదు. ఎందుకంటే చాలావరకు బయోపిక్స్ లో ఎన్నో వివాదాలు తలెత్తాయి. ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను” అంటూ మేజర్ చిత్రం తీయడంపై కారణాలు  శశికిరణ్ తిక్క వెల్లడించారు.

Sourc link

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0581yG3kAhE4xyk5Ko8MzeFoVFW3mNcRpD7x5viaS6x3xC8e9GTX6UUNWR9kav958l&id=341339392693750&sfnsn=wiwspwa

You may also like