“అన్నీ బాగున్నా అదొక్కటే మైనస్ అయ్యింది..!” అంటూ… “మేజర్” సినిమాపై నెటిజన్స్ కామెంట్స్..!

“అన్నీ బాగున్నా అదొక్కటే మైనస్ అయ్యింది..!” అంటూ… “మేజర్” సినిమాపై నెటిజన్స్ కామెంట్స్..!

by Anudeep

Ads

ఈ జూన్ 3వ తేదీన శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేష్ నటించిన మేజర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 26/11 ముంబై దాడుల్లో మరణించిన  సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా వివరించబడింది.

Video Advertisement

మేజర్ చిత్రం చూసిన తర్వాత మొదటి పదిహేను నిముషాల సన్నివేశాలు నెమ్మదిగా కొనసాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఏ ప్రేక్షకుడు అయిన తర్వాత ఏం జరుగుతుందో ఊహించగలిగిన విధంగా ఉన్నాయి.

 

మేజర్ చిత్రం ఒక మోస్తరుగా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. ఇలా టాక్ రావడానికి ఇవే మైనస్ కారణాలుగా టాక్ వెలువడుతుంది. ఆర్ట్ వర్క్ మరియు ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి మైనస్ గా నిలిచాయి. V.F.X ఎఫెక్ట్స్ కూడా చాలామట్టుకు  తేలిపోయాయి. తాజ్ హోటల్ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సన్నివేశాల్లో శశికిరణ్ తిక్క కాస్తంత జాగ్రత్త వహించితే బాగుండేది.

ఈ ముంబై దాడి తో వెబ్ సిరీస్ లో అనేక సినిమాలు వచ్చాయి. వర్మ దర్శకత్వం వహించిన ది ఎఫెక్ట్స్ అఫ్ 26/11, ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ముంబై డైరీస్ 26/11 మరియు తాజ్ హోటల్ చిత్రాల్లో చూపబడిన మెయిన్ కంటెంట్ “మేజర్” చిత్రంలో మిస్సయింది అని చెప్పవచ్చు. 26/11 దాడుల్లో ముంబై పోలీసులు కీలకమైన పాత్ర పోషించారు. అలాగే ఎంతోమంది పేద సైనికులు ప్రాణాలు విడిచిపెట్టారు. శశికిరణ్ తిక్క ఈ అంశాన్ని  చిత్రంలో చూపించడంలో పూర్తిగా మరిచి పోయాడు.

శశికిరణ్ తిక్క మెయిన్ గా సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం గురించి చెప్పాలనుకున్నాడు కాబట్టి, ఈ విషయాలన్నిటినీ పూర్తిగా విస్మరించాడు. ఇలా తన దృష్టి మొత్తం ఉన్నికృష్ణన్ కథాంశం మీద పెట్టడం ద్వారా కథకు పట్టు నిచ్చే అసలు విషయాలను గాలికి వదిలేశాడు.

ఫైనల్ గా చిత్రం బాగున్నా, చిత్రానికి ఇవి మైనస్ పాయింట్లు ఉన్నాయంటూ ప్రేక్షకుల అభిప్రాయం వెల్లడి చేస్తున్నారు.


End of Article

You may also like