Ads
రానా, సాయి పల్లవి జంట గా నటిస్తున్న సినిమా “విరాటపర్వం”. ఇది కూడా తొందరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ఉడుగుల వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా నక్సలిజం కాన్సెప్ట్ తో రూపొందుతోందని ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతోంది.
Video Advertisement
సాధారణం గా నక్సలిజం గురించి జనాలకు అవగాహన ఉన్నది చాలా తక్కువే. ఈ మాత్రం అవగాహనా కూడా సినిమాలను చూడడం వల్లనే వచ్చి ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే.. నక్సలైట్లు జనాల క్షేమం కోరినా.. సామాన్య ప్రజానీకానికి దూరం గా ఉంటారు.
సినిమాల ద్వారా.. వీళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుస్తూ ఉంటుంది. అలా.. నక్సలిజాన్ని మెయిన్ కాన్సెప్ట్ గా తీసుకుని మన టాలీవుడ్ లో కూడా సినిమాలు వచ్చాయి.. “విరాటపర్వం” సినిమాలో కూడా నక్సలిజం మెయిన్ కాన్సెప్ట్ గా ఉండబోతోంది. ఈ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపించనున్నారు. సాయి పల్లవి మొదట్లో ఓ సాధారణ ఆడపిల్లలా కనిపించినా.. తరువాత రానాను అభిమానించి ఆమెకు నక్సలైట్ గా మారినట్లు చూపించారు.
అయితే.. ట్రైలర్ లో ఓ సన్నివేశం వద్ద సాయి పల్లవి కూడా రానా విసిరిన గన్ ని పట్టుకుని షూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇదే సన్నివేశం మనం సాహో సినిమాలో కూడా గమనించవచ్చు. సాహోలో శ్రద్ధ ప్రభాస్ ను పట్టుకుని షూట్ చేస్తూ ఉంటుంది. అదే సీన్ విరాటపర్వంలో కూడా మనం చూడొచ్చు. కాకపోతే సాయి పల్లవి ఆపోజిట్ సైడ్ లో రానా ను పట్టుకుని షూట్ చేస్తూ ఉంటుంది. కేవలం ట్రయిలర్ ను చూసి సినిమాను జడ్జి చేయలేము. కాకపోతే.. ఈ సీన్ చూడగానే సాహోలోని ఆ సీన్ గుర్తొస్తోంది అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
End of Article