Ads
సాధారణంగా సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు నిజ జీవితంలో ప్రేమించుకోవడం, తర్వాత వారు పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ కొంత మంది హీరోయిన్లు, డైరెక్టర్లని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వారిలో నయనతార కూడా ఒకరు. నయనతార, డైరెక్టర్ విగ్నేష్ శివన్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. నేడు మూడు మూళ్ళ బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు.
Video Advertisement
లేడీ సూపర్ స్టార్ నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ ని నానుమ్ రౌడీ దాన్ సినిమా షూటింగ్ టైమ్లో ప్రేమించారు. వీరిద్దరూ ఇటీవల పెళ్లి చేసుకున్నారు. దాదాపు 7 సంవత్సరాలు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు.
నేడు వివాహ బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరి పెళ్లి ఫొటోలే హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరి గురించే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నయనతార, విగ్నేష్ శివన్ ల మధ్య వయసు వ్యత్యాసం ఎంత ఉందో తెలుసా..? నయనతార విగ్నేష్ శివన్ కంటే వయసులో పెద్దదే. ఈ విషయం తెలియగానే.. వారి పుట్టిన సంవత్సరాలను, తేదీలను వెతికే పనిలో పడ్డారు నెటిజన్లు.
విగ్నేష్ సెప్టెంబర్ 18 న 1985 లో జన్మించగా.. నయనతార నవంబర్ 14 న 1984 లో జన్మించారు. ఈ లెక్క ప్రకారం నయనతార విగ్నేష్ కంటే ఏడాది పెద్దది. ఇటీవలి కాలంలో వయసు తరతమ్యాన్ని ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు. వీరిద్దరూ అన్యోన్యంగా ఉండి వారి దాంపత్యాన్ని కొనసాగించాలని అభిమానులంతా కోరుకుంటున్నారు.
End of Article