Ads
సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోల ప్రభావం ఎక్కువ అనేది సౌత్ సినీ ప్రేక్షకుల మాట. ఇక్కడ హీరోలని దేవుళ్లుగా అభిమానించే అభిమానులకి లోటు లేదు. కానీ హీరోయిన్ ల విషయానికొస్తే ఆ స్ధాయి అభిమానం కనిపించదు.
Video Advertisement
అటువంటి సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది నయనతార. హీరోలతో సమానమైన క్రేజ్తో, తమిళ సినిమాలతో పాటు తెలుగులోనూ అభిమానుల్ని సంపాదించుకుంది ఈ కన్నడ మలయాళ గుమ్మ.
సినీ కెరీర్ ఎల్లప్పుడు విజయవంతంగా నడిచిన ఈమెకి, వ్యక్తిగతంగా మాత్రం ఎల్లప్పుడు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. తమిళ్ హీరో శింబుతో నయన్ ప్రేమ వ్యవహారం కోలీవుడ్ లోనే కాక, టాలీవుడ్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత అభిప్రాయ భేదాలతో వీరిరువురు విడిపోవడం జరిగింది. కొన్ని సంవత్సరాలు సాధారణం గా గడిచిన ఈమె జీవితంలోకి మళ్ళీ వివాదాలు డైరెక్టర్ ప్రభుదేవా రూపంలో అడుగు పెట్టాయి. నయన్ ప్రభుదేవాల ప్రేమ వ్యవహారం పెళ్లి పీటల దాకా చేరినట్టు కోలీవుడ్ వర్గాలు అప్పట్లో బాగా ప్రచారం చేశాయి.
ఆ క్రమంలోనే ప్రభుదేవా అతని భార్య లత కి కూడా విడాకులు ఇచ్చి నయన్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అని ప్రచారం జరిగింది. కానీ ఏం జరిగిందో ఏమో ఆ బంధం కూడా నయన్ జీవితంలో వివాదాలకు నిలయం గా మారుతూ తెగిపోయింది. అప్పట్లో ప్రభుదేవా భార్య లత, నయన్ వల్లనే తన జీవితం నాశనం అయ్యింది అని, ఆమె కనిపిస్తే ఖచ్చితంగా శిక్షిస్తానని కామెంట్ చేసింది.
అయితే నయన్ ఆ వివాదాలు అన్నింటినీ దాటుకుని కొన్ని సంవత్సరాలు గా తను ప్రేమిస్తున్న దర్శకుడు విఘ్నేష్ ని వివాహం చేసుకుంది. ఈ క్రమంలో నయన్ పైన ప్రభుదేవా భార్య అప్పట్లో చేసిన కామెంట్ లను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
End of Article