“అంటే సుందరానికి..” సినిమాలో ఓ పాపులర్ డైరెక్టర్ నటించారు అని తెలుసా? ఏ రోల్ లో అంటే?

“అంటే సుందరానికి..” సినిమాలో ఓ పాపులర్ డైరెక్టర్ నటించారు అని తెలుసా? ఏ రోల్ లో అంటే?

by Anudeep

Ads

నాని కామెడీ పాత్ర చేసి చాలా సంవత్సరాలు అయ్యింది. “అంటే సుందరానికి..” సినిమాలో నాని మళ్లీ కామెడీ ఎక్కువగా ఉన్న పాత్ర చేస్తున్నారు అని మనకు ముందే అర్థమయ్యింది. నానిని ఇలా చూడాలి అని ప్రేక్షకులు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ లో చూపించినట్టుగానే ఒక సింపుల్ స్టోరీ లైన్ మీద నడుస్తుంది.

Video Advertisement

కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఆ సింపుల్ స్టోరీని కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా పాత్రలని ప్రేక్షకులకి పరిచయం చేయడంలోనే అయిపోతుంది. అసలు కథ ఉండేది మాత్రం సెకండ్ హాఫ్ లోనే. సినిమాకి పెద్ద హైలైట్ మాత్రం నాని.

నాని, నజ్రియా కాకుండా.. ఈ సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది విలన్ పాత్ర. ఈ సినిమాలో నజ్రియా, నానిని ప్రేమిస్తోంది అన్న విషయం తెలుసుకున్న తల్లితండ్రులు ఆమెను మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనీ అనుకుంటారు. ఈ సినిమాలో నజ్రియా ఫామిలీ క్రిస్టియన్స్. అందుకే ఆమెకు ఓ క్రిస్టియన్ వ్యక్తి తోనే పెళ్లి నిశ్చయిస్తారు. అయితే.. నజ్రియాకు ఈ పెళ్లి ఇష్టం ఉండదు. ఈ విషయాన్నీ నాని ఆ పెళ్లి కొడుకుని కలిసి చెప్తాడు.

ante sundaraniki villan 1

కానీ.. అతను చాలా కూల్ గా తనకి ఏమి ఇబ్బంది లేదని.. కావాలంటే పెళ్లి అయ్యాక మీరు కూడా సన్ డేస్ వచ్చి పిల్లలతో ఆడుకోవచ్చని చెప్పి, పెళ్లి మాత్రం కాన్సల్ అయ్యేది లేదని చెప్పేస్తాడు. స్మూత్ గా సాగిపోతున్న సినిమాలో ప్రాక్టికల్ విలన్ గా నటించిన ఈ వ్యక్తి ఎవరో కాదు. డైరెక్టర్ వెంకటేష్ మహా. విజయవాడకు చెందిన వెంకటేష్ మహా c/o కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలను డైరెక్ట్ చేసి పాపులర్ అయ్యారు. అంటే సుందరానికి సినిమాలో నటించి ఒక్క స్మైల్ లో శాడిజాన్ని చూపించి అందరిని ఆకట్టేసుకున్నారు. డైరెక్షన్ లోనే కాదు.. నటనలో కూడా తనకి టాలెంట్ ఉంది అని ప్రూవ్ చేసుకున్నారు.


End of Article

You may also like