Ads
తలుచుకుంటే సాధ్యం కాదు అనేది ఏదీ లేదు. సాధించాలి అనే పట్టుదల ఉంటే ఊహల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా చేసి చూపిస్తారు కొందరు వ్యక్తులు.
Video Advertisement
నేటి యువతరం తమ తెలివితేటలతో అనుకున్నది సాధించి ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేస్తారు. మరి ఈ తరానికి ఆదర్శంగా నిలిచిన ఒక గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం.
పూట గడవని పరిస్థితి నుంచి రెండు వేల కోట్ల రూపాయల సంస్థకు అధిపతిగా మారారు. కథ వింటే ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
ఇతని పేరు పిసి ముస్తఫా. ఈయన కేరళలోని చెన్నలోడే అనే గ్రామంలో ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. తండ్రి ఒక రోజు వారి కూలీ. రోజుకు ఒక పది రూపాయల సంపాదన కూడా ఉండేది కాదు. మూడుపూటలా కడుపునిండా భోజనం చేసే పరిస్థితి కూడా వీళ్ళకు లేదు.
తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు ముస్తఫా. ఆరో తరగతి ఫెయిల్ అయి తండ్రితో పనికి వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. కానీ తండ్రికి తన కొడుకు బాగా చదువుకొని గొప్పవాడు కావాలని ఎంతో ఆశపడే వారు.
ఉపాధ్యాయులు ప్రోత్సహించడంతో తిరిగి మళ్లీ స్కూలు చదువు మొదలు పెట్టారు. ఆరో తరగతి ఫెయిల్ అయిన ముస్తఫా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలో 63 ర్యాంకు సంపాదించారు. కాలికట్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తన ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు.
1995 ఇంజినీరింగ్ విద్య అనంతరం బెంగుళూరు లోని ఒక చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీలో ఆరువేల జీవితానికి ఉద్యోగ చేరారు. రెండు నెలల అనంతరం మోటరోలా కంపెనీ లో ఉద్యోగం చేరి అక్కడ అతని మొదటి జీవితంగా 1.3 లక్షల అనుకున్నారు. ఇంత పెద్ద జీతం తో కూడా సంతృప్తి చెందలేదు.
ఎన్నో కష్టాల కడలిని దాటి వచ్చిన ముస్తఫా ఇంకా ఏదో సాధించాలని తహతహలాడుతూ ఉండేవారు. 2003లో MBA చదవాలనే కోరికతో బెంగళూరు తిరిగివచ్చారు.
బెంగుళూరులో ఉండే ముస్తఫా కజిన్ షంషుద్ధిన్ ఇడ్లీ దోశ పిండి ఒక ప్లాస్టిక్ కవర్ లో చుట్టి అమ్ముతున్న విషయాన్ని గమనించాడు. ఆ విషయంపై కజిన్ తో చర్చించాడు. ఇదే వ్యాపారంగా మొదలు పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో ముందడుగు వేశాడు.
25 వేల రూపాయలతో పెట్టుబడి తో కొందరు భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. బెంగళూరులో ఉన్న 20 దుకాణాలకి వీళ్ల “ID Fresh” బ్రాండ్ తో ఉన్న ఇడ్లీ దోశ పిండి పంపిణీ చేయడం మొదలుపెట్టారు. కేవలం రెండు సంవత్సరాల లోనే 3500 కిలోల ఇడ్లీ పిండి దోశ పిండి తయారుచేస్తూ 300 దుకాణాలకు పంపిణీ చేసే స్థాయికి ఎదిగారు.
2007వ సంవత్సరంలో తన ఎంబీఏ విద్యను పూర్తి చేసి అనంతరం ID Fresh కంపెనీకి సీఈఓగా పదవీబాధ్యతలు చేపట్టారు ముస్తఫా. 2013లో తమ వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరింపజేశారు. 2022 సంవత్సరానికల్లా 500 కోట్ల టర్నోవర్ సాధించి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఎదిగారు.
ఈ ID Fresh ఫూడ్స్ సమస్థ ఇప్పుడు వెయ్యి మందికి పైగా ఉపాధి కల్పిస్తుంది. పూటగడవని కోహ్లీ కొడుకుగా జీవితం గడిపిన ముస్తఫా ఇప్పుడు రెండు వేల కోట్ల రూపాయల సంస్థకు అధిపతి గా మారారు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ నేటి యువతకి మార్గదర్శకంగా నిలిచారు.
End of Article