Ads
ఒకరు తెలుగు ఇండస్ట్రీ కి సూపర్ స్టార్ అయితే.. మరొకరు బాలీవుడ్ లో బిగ్ బీ. వీరిద్దరికి ఏమి పోలిక ఉందా అని ఆలోచిస్తున్నారా? సూపర్ స్టార్ కృష్ణ మరియు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇద్దరూ అరవైవ దశకంలోనే ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు. 1965 లో సూపర్ స్టార్ కృష్ణ తేనే మనసులు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.
Video Advertisement
అలాగే.. 1969 వ సంవత్సరంలో బిగ్ బీ అమితాబ్ అబ్బాస్ దర్శకత్వంలో సాత్ హిందూస్థానీ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇది బిగ్ బీ నటించిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ మూవీ కావడం విశేషం.
మరో విశేషం ఏంటంటే.. బాలీవుడ్ లో బిగ్ బీ నటించిన ఎన్నో సినిమాలు తెలుగునాట రీమేక్ అయ్యాయి. ఎన్టీ రామారావు తో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు బిగ్ బీ అమితాబ్ నటించిన సినిమాలను తెలుగులోకి రీమేక్ చేసారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా అమితాబ్ నటించిన సినిమాలను తిరిగి తెలుగులో చేసారు. అమితాబ్ నటించిన సత్తే పే సత్తే సినిమాను తెలుగులో అందరికంటే మొనగాడు పేరిట సూపర్ స్టార్ కృష్ణ రీమేక్ చేసారు.
హిందీలో అమితాబ్ నటించిన మహాన్ సినిమాను తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ “కుమార్ రాజా” పేరిట రీమేక్ చేసారు. ఈ సినిమా మంచి విజయమే సాధించింది. ఇది కాకుండా.. అమితాబ్ “ఇంక్విలాబ్” సినిమాను తెలుగులో “ముఖ్యమంత్రి” పేరిట సూపర్ స్టార్ కృష్ణ రీమేక్ చేసారు. తెలుగులో కృష్ణ నటించిన సినిమాలను కూడా అమితాబ్ బాలీవుడ్ లో రీమేక్ చేసారు.
End of Article