Ads
హిందీలో “ఖుద్ ఘార్జ్” అనే పేరుతొ ఓ సినిమా వచ్చింది. అది అక్కడ విజయం సాధించడంతో ఆ సినిమాను తెలుగులో కూడా “ప్రాణ స్నేహితులు” పేరిట ఈ సినిమాను కృష్ణం రాజు రీమేక్ చేసారు. అయితే.. తమిళం లో రజినీకాంత్ నటించిన “అన్నమయ్య” సినిమా కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది.
Video Advertisement
అన్నమయ్య సినిమా కూడా తమిళనాట సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేయాలనీ టాలీవుడ్ దర్శక ప్రముఖులు చాలా మందే అనుకున్నారు. కానీ, డిమాండ్ ఎక్కువ ఉండడంతో ధర కూడా ఎక్కువ ఉంది.
కేవలం నిర్మాత కెవివి గారు మాత్రమే ఎక్కువ ధర పెట్టి ఈ సినిమా రైట్స్ ను కొనుక్కున్నారు. ఈ సినిమాను తెలుగులో ఎవరితో రీమేక్ చేయాలి.. ఏ దర్శకుడితో పని చేయాలి అని ఈవీవీ సందిగ్ధంలో పడిపోయారు. ఈ క్రమంలో ఓ సారి ఫ్లైట్ లో ప్రయాణిస్తూ చిరంజీవికి ఈ కథ చెప్పడం.. ఆయన కూడా ఒకే చేయడం జరిగిపోయాయి. అప్పటికే సుందరకాండ సినిమా సక్సెస్ లో కెవివి బిజీగా ఉన్నారు.
అదే టైంలోనే రవిరాజా పినిశెట్టి వెంకటేష్ తో మరో సినిమా చేయాలనీ కోరారట. ఆ సమయంలో వెంకటేష్ తో సినిమా చేయాలా లేదా చిరుతో చేయాలా అని కెవివి సందిగ్ధంలో పడిపోయారట. సుందరకాండ విజయం సాధించి ఉండడంతో.. వెంకటేష్ తోనే సినిమా తీయాలని అనుకున్నారు. “కొండపల్లి రాజా” సినిమాను తెరకెక్కించారు. ఇందులో సుమన్, వెంకటేష్ స్నేహితులుగా నటించారు. నగ్మా హీరోయిన్ గా నటించారు. పాటల కోసమే 25 లక్షలు ఖర్చు చేసారు. ఈ సినిమా విజయం సాధించినా “ప్రాణ స్నేహితులు” సినిమా పాటలను అనుమతి లేకుండా రీమిక్స్ చేసారు అంటూ.. కృష్ణంరాజు గారు కెవివి గారిపై కేసు వేశారు. దీనితో ఈ సినిమా విజయం సాధించిందన్న ఆనందమే కెవివి గారికి లేకుండా పోయింది. పైగా ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
End of Article