Ads
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా, ఇప్పుడు విలన్ గా మరియు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న శ్రీకాంత్ గురించి అందరికి తెలిసిందే.
కెరీర్ లో మంచి పొజిషన్ లో ఉన్న టైం లోనే.. నటి ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి “ఆమె” చిత్రంలో నటించారు. చిత్రానికి అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది.
Video Advertisement
కానీ పెళ్లి తరువాత ఊహ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తన తోటి నటులు ఆమని, ఇంద్రజ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చి, సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అయిపోయారు. కార్తికేయ హీరోగా నటించిన చావు కబురు చల్లగా సినిమాలో ఆమని ఓ వైవిధ్యమైన పాత్రలో నటించారు. అయితే ఊహ మాత్రం పెళ్లి తర్వాత పూర్తిగా వెండితెరకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి స్పందించారు.
పిల్లల భవిష్యత్తే తనకు ముఖ్యమని అందుకే పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. ఇప్పట్లో తనకు రీ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యం లేదని అంటూనే నాకు ఒక కోరిక ఉంది అంటూ మనసులోని మాటను బయట పెట్టారు. శ్రీకాంత్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రోషన్ నిర్మల కాన్వెంట్ చిత్రంలో నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే భవిష్యత్తులో తన కొడుకు రోషన్ కి తల్లి పాత్రలో నటించే ఆవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, అలాగే తన భర్తతో కలిసి రోషన్ కి తల్లిదండ్రులుగా నటించే అవకాశం వస్తేనే తిరిగి ఇండస్ట్రీలో అడుగు పెడతాను అన్నారు. ప్రస్తుతం ఊహ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్య విడుదలైన పెళ్లి సందడి మూవీ ద్వారా రోషన్ ఆకట్టుకోగా, అఖండ సినిమాలో శ్రీకాంత్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇటీవల షూట్ ఎట్ ఆలేర్ అనే వెబ్ సిరీస్ లో కూడా శ్రీకాంత్ నటించాడు. దీన్ని చిరంజీవి కూతురు సుస్మితా కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించారు.
End of Article