“రాజమౌళి” సినిమా కోసం… “మహేష్ బాబు” ఈ కండిషన్ పెట్టారా..?

“రాజమౌళి” సినిమా కోసం… “మహేష్ బాబు” ఈ కండిషన్ పెట్టారా..?

by Anudeep

Ads

టాలీవుడ్ లో నేటి తరం హీరోలలో మాస్ ఆడియెన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమా ఎలా ఉన్నా మహేష్ కోసం ఒక్కసారి చూడాలి అనుకునే అభిమానులు ఆయనకి చాలా మంది ఉన్నారు.

Video Advertisement

ప్రత్యేకం గా అమ్మాయిల్లో అయితే మహేష్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనేది అందరికి తెలిసిన విషయమే. అలాంటి సూపర్ స్టార్ పక్కన హీరోయిన్ గా నటించాలని టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రతి హీరోయిన్ కోరుకుంటారు.

మహేష్ కెరీర్ లో చూస్తే అత్యధిక శాతం బాలీవుడ్ ముద్దు గుమ్మలే ఆయన పక్కన హీరోయిన్ గా కనిపించారు. హీరోగా మహేష్ మొదటి సినిమా రాజకుమారుడులో బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా నటించింది. తర్వాత టక్కరిదొంగలో బిపాషా బసు, లీసా రే నటించారు. వీరిద్దరూ కూడా బాలి వుడ్ కి చెందిన వారే కావడం విశేషం. ఇలా చెప్పుకుంటే పోతే సోనాలి బింద్రే, అదితి రావు, కృతి సనన్ మొదలైన బాలీవుడ్ భామలు మహేష్ పక్కన ఆడి పాడే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.

ఇక బాలీవుడ్ కె చెందిన నమ్రత శిరోద్కర్ అయితే ‘వంశీ’ సినిమా లో మహేష్ పక్కన నటించి, మహేష్ నిజ జీవితం లో హీరోయిన్ గా మారిపోయి,అతడి ని పెళ్లి చేసుకుని, ఎంతో మంది అమ్మాయిల ఊహల రాకుమారిడిని సొంతం చేసుకుంది. అయితే ఇపుడు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అది ఏంటి అంటే మహేష్ రాజమౌళి తో చేయబోయే సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ వద్దని, టాలీవుడ్ హీరోయిన్ లకే ప్రాధాన్యం ఇవ్వమని రాజ మౌళిని కోరినట్టు తెలుస్తుంది.

తన గత సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్ లతో పని చేసిన మహేష్, వాళ్ల కాల్షీట్ ల ఇబ్బంది, వాళ్లకి కల్పించే ప్రత్యేక సౌకర్యాలు, వాళ్ళు పెట్టె షరతులకి విసుగు చెంది మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి ఈ సినిమా లో నటించే నటీనటుల వివరాలు వెల్లడించే వరకు ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి, అని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే మహేష్ సినిమా పూర్తయ్యాకే, రాజమౌళితో పాన్ ఇండియా మూవీలో నటించనున్నారు మహేష్.

Also Read :


End of Article

You may also like