లీక్ అయిన “SSMB 28” స్టోరీ..! ఈ కథ ఎక్కడో చూసినట్టు ఉంది కదా..?

లీక్ అయిన “SSMB 28” స్టోరీ..! ఈ కథ ఎక్కడో చూసినట్టు ఉంది కదా..?

by Sunku Sravan

Ads

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మరియు హీరో మహేష్ బాబు కాంబినేషన్ లో 28వ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.

Video Advertisement

ఇందులో ఒకటి 2005లో వచ్చిన అతడు హిట్ అవ్వగా మరో సినిమా 2010లో వచ్చిన ఖలేజా సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఇందులో అతడు కొంతవరకు హిట్ టాక్ తెచ్చుకోగా, ఖలేజా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి చివరికి డిజాస్టర్ గా నిలిచింది.

కానీ 2 మూవీస్ లో హీరో మహేష్ బాబుని కొత్తలుక్ లో చూపించడం త్రివిక్రమ్ కే దక్కింది అని చెప్పవచ్చు. అయితే మహేష్ బాబు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ తన కెరియర్ కు ఉపయోగపడే సినిమాలు ఇస్తున్నాడని అన్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో నిర్మించబోయే చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మించనున్నారు. అయితే ఇందులో సినిమా స్టొరీ లైన్ ఏ విధంగా ఉండబోతుందనేది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే త్రివిక్రమ్ నిర్మించిన సినిమాల్లో అరవింద సమేత మరియు ఖలేజా తప్ప అన్ని మూవీస్ దాదాపుగా ఓకే కథతో రూపొందినవే.

ఒక కుటుంబం ఆ కుటుంబంకి వచ్చిన సమస్యలను తీర్చడం కోసం హీరో ఆ ఇంటికి రావడం.. ఈ విధంగా కథ చుట్టూ భావోద్వేగాలు, కామెడీ, ఫైట్స్, ఇలాంటి అంశాలతో త్రివిక్రమ్ సినిమాలు రూపొందుతాయి. అయితే ఇదే సబ్జెక్టుతో మహేష్ బాబు సినిమా వద్దంటూ కొంత మంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు..

సినీ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్ మరియు మహేష్ సినిమాకి “నువ్వు నాకు నచ్చావు” అనే మూవీ టచ్ ఉంటుందని, ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటి హీరో సిటీ నుంచి వచ్చి తన యొక్క తండ్రి స్నేహితుడు ఇంట్లో ఉండడం హీరోయిన్ మరియు హీరోయిన్ చెల్లెలు తో లవ్ ట్రాక్ నడపడం.. అనే విధంగా కథ సాగుతూ ఉంటుందని తెలుస్తోంది. కానీ టేకింగ్ విషయానికి వస్తే నువ్వు నాకు నచ్చావ్ కు పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా,తమన్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది.


End of Article

You may also like