“విరాట పర్వం” సెన్సార్ టాక్..! సినిమాకి హైలైట్ ఏవంటే..?

“విరాట పర్వం” సెన్సార్ టాక్..! సినిమాకి హైలైట్ ఏవంటే..?

by Anudeep

Ads

యంగ్ ఫిల్మ్ మేకర్ వేణు ఊడుగుల  “నీది నాది ఒకే కథ” ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ  సినిమాకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తన రెండో చిత్రం “విరాట పర్వం” అనేక అవాంతరాలను దాటుకుని ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Video Advertisement

ఇందులో సాయి పల్లవి, రానా హీరో హీరోయిన్లు గా నటించారు. ప్రియమణి, ఈశ్వరీ రావు, నవీన్ చంద్ర, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ మరియు పాటలకు మంచి స్పందన వచ్చింది.


నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెంకటేష్,  డైరెక్టర్ సుకుమార్ హాజరయ్యారు. ఇదొక పీరియాడికల్ డ్రామా చిత్రం. సెన్సార్ తో పాటు అన్ని  ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి యు/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం నిడివి 151 నిమిషాలు ఉన్నట్టు తెలుస్తుంది. విరాట పర్వం నిర్మాతలు సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి క్రిస్పీ రన్ టైం ఎంచుకున్నారని సెన్సార్ బృందం అభిప్రాయ పడింది.


ఇంకా విశేషం ఏంటంటే.. హృదయాన్ని హత్తుకునే అద్భుమైన ప్రేమ కథ అని సెన్సార్ అధికారుల బృందం ప్రశంసించారు. సాయి పల్లవి, రానా ఇద్దరూ సినిమాలో తమ నటనకు అధికారుల నుండి మంచి మార్కులు కొట్టేశారు. లక్కీగా విరాట పర్వం సినిమాకి కనీసం మూడు వారాల వరకు పెద్దగా పోటీ లేదు. కాబట్టి, విడుదల తర్వాత సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే, విరాట పర్వం విజేతగా నిలుస్తుంది! ఈ సినిమాకు అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో రేపటితో  తేలనుంది.


End of Article

You may also like