నయన్, విఘ్నేశ్ ల రిసెప్షన్ కాన్సల్…! కారణం ఇదేనా.?

నయన్, విఘ్నేశ్ ల రిసెప్షన్ కాన్సల్…! కారణం ఇదేనా.?

by Anudeep

Ads

ఇటీవల నయన్ విఘ్నేష్ శివన్ వివాహం ముగిసినప్పటికీ వారి పెళ్లి, రిసెప్షన్ కి సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాప్ గానే ఉన్నాయి.
వీరి పెళ్లిని తిరుపతిలో చేసుకోవాలని మొదట నిర్ణయింకున్నారు కానీ ఏం జరిగిందో ఏమో చివరి క్షణంలో క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తరువాత మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో పెళ్లి ఘనంగా జరిగింది. త్వరలో ఈ వివాహము నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానుంది.

Video Advertisement

అయితే వివాహానంతరం చెన్నైలో రిసెప్షన్ ఉంటుందని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు నిర్వహించలేదు అని పలువురు విమర్శిస్తున్నారు. రిసెప్షన్ కనుక చెన్నైలో నిర్వహిస్తే కోలీవుడ్ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యే వారు. కానీ ఇప్పుడేమో రిసెప్షన్ క్యాన్సిల్ అంటూ సమాచారం అందుతోంది.

రెసెప్షన్ కోసం ఖర్చు పెట్టాలి అనుకున్న మొత్తాన్ని తమిళనాడులోని అన్ని అనాధ ఆశ్రమాలకు పంచాలని నయన్‌ మరియు విఘ్నేష్ లు భావించారట. దీంతో ఒక రోజు పూర్తిగా అన్ని అనాధ ఆశ్రమాలకు ఆహారం పెట్టేంత మొత్తాన్ని నయన్ మరియు విఘ్నేష్ శివన్‌ లు ఇచ్చారని సమాచారం.

అనుకున్నట్టుగా రిసెప్షన్ జరిగితే.. కొద్దిమంది మాత్రమే గుర్తుంచునే వారు. కాని ఇప్పుడు నయన్‌ మరియు విఘ్నేష్ చేసిన మంచి పనిని అందరూ అభినందిస్తున్నారు. మీపై ఉన్న గౌరవం మరింత పెరిగింది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

పెళ్లి అనంతరం వెంటనే తిరుపతి వెళ్లిన నయన్ దంపతులు ఇప్పుడు కేరళలోని నయన్‌ స్వస్థలం కేరళ కు వెళ్లి తన తల్లి వద్ద ఆశీస్సులు తీసుకొని, అక్కడ ఉన్న అనేక పుణ్యక్షేత్రాలు, ప్రముఖ ప్రదేశాలు సందర్శిస్తున్నారని సమాచారం. అక్కడ నుండి వచ్చాక మళ్లీ తిరిగి సినిమాలతో బిజీ అవ్వనున్నారు.


End of Article

You may also like