Ads
వెంకట నరసింహ రావు అంటే ఎవ్వరికీ తెలియదు. కానీ రాళ్ళపల్లి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఒకప్పటి తెలుగు సినిమాకు దొరికిన విలక్షణ నటుడు ఆయన. జ్యోతిష్కుడుగా, పోలీస్ గా, నావికుడిగా, వంటవాడిగా, హిజ్రాగా ఇలా ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో అవలీలగా లీనం అయిపోయి నటించగల సమర్థుడాయన.
Video Advertisement
ఆయన గొంతు ఇప్పటికే ప్రేక్షకుల చెవుల్లో మారు మ్రోగుతూనే ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. ఆయన సినిమా జీవితం అందరికీ దాదాపు సుపరిచితమే. కానీ, ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు.
ఆయనకు ఓ కూతురు ఉందన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఆమె పేరు మాధురి. ఆమె వైద్య విద్య చదివి డాక్టర్ అవ్వాలనుకుంది. అందుకోసం రష్యాలో సీట్ కోసం కూడా ప్రయత్నించింది. ఆమె కల నెరవేరి రష్యాలో సీట్ దొరికింది. అయితే.. రష్యా కు వెళ్లడం కోసం.. ఆమె చెన్నై నుంచి ట్రైన్ లో ఢిల్లీకి బయలుదేరింది. ఈ ప్రయాణంలోనే ఆమెకు వైరల్ ఫీవర్ సోకింది.
అయితే.. ఆమె ఆరోగ్యం విషమించి రష్యాకు వెళ్లకుండానే మృతి చెందింది. ఢిల్లీ నుంచి.. ఆమె మృతదేహాన్ని చెన్నైకి తీసుకురావడానికి అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు రాళ్లపల్లికి సాయం చేశారట. కూతురు మరణ వార్త విన్న తరువాత నుంచి రాళ్ళపల్లి మానసికంగా క్రుంగిపోయారు. ఆమె మృతిని తట్టుకోలేకపోయారు. బాధని అదిమిపట్టుకుని తెరపై హాస్యం పండించేవారు. ఆమెపై ప్రేమకు గుర్తుగా.. తన ప్రతి చొక్కా పైనా “మాధురి” అని కుట్టించుకునేవారట.
End of Article