Ads
సీనియర్ ఎన్టీఆర్ కి ఎంత పేరు ఉందో మనకి తెలుసు. నటనతో ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్. సినిమా పరిశ్రమలో ఎదురులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్. నిజానికి అన్న గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.
Video Advertisement
ఇక సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లోనే ఎన్నో సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టారు. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్, శోభన్ బాబు వంటి హీరోలు అప్పట్లో పోటాపోటీగా నటించేవారు.
అయితే… ఒకానొక టైం లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తక్కువ టైం లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ఈనాడు సినిమా కూడా అప్పుడే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. మలయాళం లో హిట్ అయిన ఈనాడ్ సినిమాను రీమేక్ చేసి తెలుగులో “ఈనాడు” గా రిలీజ్ చేసారు.
ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ సైకిల్ తొక్కుతూ పాడే పాట సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఎన్టీఆర్ కు సపోర్ట్ ఇవ్వడం కోసమే కృష్ణ ఈ పాట చేసారని అప్పట్లో టాక్ కూడా నడిచింది. ఈనాడు మూవీ రిలీజ్ అయిన వారం తరువాత టిడిపి పార్టీ గెలిచి.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో కృష్ణ ఎన్టీఆర్ ను అభినందిస్తూ పేపర్లో ఓ యాడ్ కూడా ఇచ్చారు. అప్పట్లోనే అది చాలా వైరల్ అయింది.
End of Article