Ads
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. ఏ హీరో టాప్, ఏ హీరోయిన్ గ్రేట్, లేదా ఆ డైరెక్టర్ తో పోలిస్తే ఏ డైరెక్టర్ గొప్ప అని సినీ ప్రేమికులు చర్చించుకుంటూనే ఉంటారు. అలాంటిదే ఇప్పుడో కొత్త అంశం తెర మీదకు వచ్చింది. పుష్పతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న లెక్కల మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ తో.. క్లాసిక్ హిట్లతో దూసుకుపోతున్న మన మాటల మాంత్రికుడిని పోల్చడం ప్రారంభించారు.
Video Advertisement
అయితే మనం వెనిక్కెళ్లి వీరి ప్రస్థానాన్ని గనుక పరిశీలిస్తే.. ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారే. సుకుమార్ మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ కెరీర్ ప్రారంభిస్తే.. త్రివిక్రమ్ మాటల రచయితగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
సుకుమార్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను కట్టి పడేస్తే.. త్రివిక్రముడు తన మాటలతో అందరిని ఆలోచింపచేస్తాడు. మొదటి సినిమా అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్యతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు సుకుమార్. 4 కోట్లు పెట్టి తీసిన సినిమా 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తరువాత తీసిన “జగడం” కొంత నిరుత్సాహ పరిచినా 100% లవ్ తో మరోసారి అందరిని ఆకట్టుకున్నాడు. 1 నేనొక్కడినే అంటూ మహేష్ బాబుతో ఓ హాలీవుడ్ రేంజ్ మూవీ తీసాడు సుక్కు సార్ కానీ తెలుగు ప్రేక్షకులు ఆ ప్రయోగాత్మక చిత్రాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఇతర దేశాల్లో 1 నేనొక్కడినే మంచి వసూళ్లను రాబట్టింది. ఉక్రెయిన్ లో విడుదల చేసిన తొలి తెలుగు సినిమా కూడా ఇదే.
ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి” నాన్నకు ప్రేమతో” తీసి మళ్ళీ విజయాల బాట పట్టాడు డైరెక్టర్ సుకుమార్. ఇంకా ఆ తరువాత వచ్చిన రంగస్థలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అటు రామ్ చరణ్ కు, ఇటు సుకుమార్ కు తిరుగులేని విజయాన్ని అందించింది. గత సంవత్సరం విడుదలైన పుష్ప గురించి అందరికి తెలిసిందే ‘తగ్గేదెలే’ అంటూ అల్లు అర్జున్ పలికే డైలాగ్ సుకుమార్ రాబోయే సినిమాల్లో ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతాడు అని అర్థం చేసుకోవచ్చు.
మన దర్శక ధీరుడు రాజమౌళి సైతం మీ అభిమాన డైరెక్టర్ ఎవరు అంటే.. సుకుమార్ అనే చెప్తాడు అంటే సుమార్ డైరెక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆడియన్స్ మెదడుకు పని చెప్పే స్క్రీన్ ప్లే డైరెక్టర్ సుకుమార్ కే సొంతం. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే.. పంచ్ లు, ప్రాసలు, జీవిత సత్యాలతో ప్రేక్షకులను ఆకర్షిస్తాడు. తెలుగు రచయితల స్థాయిని పెంచినవాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. దర్శకుడు విజయ భాస్కర్ వద్ద డైలాగ్ రైటర్ గా స్వయం వరం, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చవ్ వంటి సినిమాలకు అద్భుతమైన డైలాగులు రాసి బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డులు కూడా అందుకున్నాడు.
నువ్వే నువ్వే సినిమాకు డైరెక్టర్ గా చేసి కొంత గ్యాప్ తరువాత అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, అ ఆ, అరవింద సమేత, అల వైకుంఠపురంలో వంటి వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. పదునైన సంభాషణలకు పెట్టించి పేరు. త్రివిక్రమ్ కలంలోంచి వెండి తెరకు జాలువారిన ఎన్నో సంభాషణలు ఎప్పుడు తెలుగు ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటాయి. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో ఆర్తీ అగర్వాల్ తో సుహాసిని చెప్పే మాటలు మనం ఎప్పటికీ మరిచిపోలేం.
అందుకే అంటారు.. తూటాలాంటి సీన్స్ త్రివిక్రమ్ పెన్ నుంచి గన్ లా పేలుతుంటాయ్ అని.. ప్రేక్షకుడి జ్ఞానస్థాయిని పెంచే వాడు డైరెక్టర్ త్రివిక్రమ్. త్రివిక్రమ్ మాటలు సినిమాలకే పరిమితం అవలేదు. అనేక వేదికలపై అద్భుతమైన ఉపన్యాసాలతో అందరిని ఆకట్టుకుంటాడు. ఇక సుకుమార్, త్రివిక్రమ్ లో ఎవరు ఎక్కువ, తక్కువ అంటే ఏం చెప్పలేం.. ఇద్దరిలో ఎవరి పంథా వారిదే, ఒకరు కథని కొత్తగా ప్రేక్షకుడి మెదడుకి పని చెప్పాలని ప్రయత్నిస్తే .., ఇంకొకరు కుటుంబసమేతంగా సున్నితమమైన హాస్యంతో ఆనందింపజేస్తూనే జీవిత విలువలు నేర్పాలని చూస్తారు.
ఒకరి లక్ష్యం మేధావుల మనసులు గెలవడం అయితే, ఒకరి లక్ష్యం కుటుంబ ప్రేక్షకులతో సహా అన్ని వర్గాలు ఆనందించాలని. ఎవరు గొప్పంటే ఎలా చెప్పగలం . . సింగీతం శ్రీనివాసరావుని ఎక్కువ చేస్తూ జంధ్యాల గారిని తక్కువ చేయగలమా..!??
End of Article