కోచింగ్ హబ్ గా మారిపోయిన బీహార్ ససారం రైల్వే స్టేషన్.. వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనుక అసలు స్టోరీ ఏంటంటే?

కోచింగ్ హబ్ గా మారిపోయిన బీహార్ ససారం రైల్వే స్టేషన్.. వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనుక అసలు స్టోరీ ఏంటంటే?

by Anudeep

Ads

అందరికి బీహార్ లోని ససారం జంక్షన్ రైల్వే స్టేషన్ మాత్రమే. కానీ.. అక్కడ ఉన్న విద్యార్థులకు మాత్రం అదో కోచింగ్ సెంటర్. గత కొన్ని సంవత్సరాలుగా, వేలాది మంది విద్యార్థులు తమ పోటీ పరీక్షలను క్లియర్ చేయడానికి ససారం రైల్వే స్టేషన్ ను కోచింగ్ మరియు స్టడీ సెంటర్‌గా ఉపయోగించుకుంటున్నారు.

Video Advertisement

విద్యార్థులు రైల్వే స్టేషన్ లో కూర్చుని చదువుకుంటున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని వెనుక పెద్ద కథే ఉంది లెండి. అసలు రైల్వే స్టేషన్ కోచింగ్ హబ్ గా ఎలా మారింది..?

bihar sasaram 1

2002 నుండి, రైల్వే స్టేషన్‌లోని 1 మరియు 2 ప్లాట్‌ఫారమ్‌లు వేలాది మంది సివిల్ సర్వీస్ ఔత్సాహికులకు సురక్షితమైన ప్రదేశంగా ఎలా మారింది? అక్కడ ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటూ ఉంటారట. ఈ స్టేషన్ సివిల్ సర్వీసెస్ ఆశావాదులకు మాత్రమే కాకుండా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, బహుళ బ్యాంక్ పరీక్షలు, IITలు మరియు IIMల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా స్టడీ సెంటర్ గా ఉపయోగపడుతోంది.

bihar sasaram 2

అసలు ఈ రైల్వే స్టేషన్ కి వచ్చి చదువుకోవడం అనేది 2002 లో మొదలైంది. 2002 లో కొంతమంది విద్యార్థులు గ్రూప్ గా ఏర్పడి ససారం రైల్వే స్టేషన్ కు చదువుకోవడానికి వచ్చేవారు. అది వారికి అలవాటుగా మారింది. అసలు వారు రైల్వే స్టేషన్ కు వచ్చి చదువుకోవడానికి ప్రధాన కారణం ఊరిలో ఎక్కడా కరెంటు లేకపోవడమే. రైల్వే స్టేషన్ లో ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉంటుంది. అందుకే వారు రైల్వే స్టేషన్ కు వచ్చి చదువుకునేవారు.

bihar sasaram 3

వారి కష్టం ఫలించి.. వారందరికీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దీనితో ఆ స్టేషన్ కాస్తా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అప్పటినుంచి విద్యార్థులు అక్కడకే వచ్చి చదువుకోవడం మొదలుపెట్టారు. దీనితో రైల్వే స్టేషన్ కాస్తా కోచింగ్ సెంటర్ గా మారిపోయింది. కొన్ని రోజుల క్రితం, IAS అధికారి అవనీష్ శరణ్ ఒక ఫోటోను ట్వీట్ చేశారు, ఇది చాలా మంది ప్రభుత్వ ఉద్యోగ ఔత్సాహికులు ప్లాట్‌ఫారమ్‌పై కూర్చుని, చదువులో నిమగ్నమై ఉన్నట్లు ఈ ఫొటోలో కనిపిస్తుంది. దీనితో ఈ ఫోటో వైరల్ అయింది. మనకి ఎన్ని సదుపాయాలు ఉన్నా మన లక్ష్యాలు నెరవేర్చుకునే దిశగా పనిచేసేటప్పుడు కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. కానీ.. వీరికి కనీసం కరెంటు సదుపాయం కూడా లేకపోయినా.. వారు ఏ విధంగా కష్టపడుతున్నారో చూస్తే గ్రేట్ అనిపిస్తుంది కదా..


End of Article

You may also like