పెళ్లయ్యాక వేరు కాపురం ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నారు.? ఈ అమ్మాయి ఇచ్చిన ఆన్సర్ చూస్తే..?

పెళ్లయ్యాక వేరు కాపురం ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నారు.? ఈ అమ్మాయి ఇచ్చిన ఆన్సర్ చూస్తే..?

by Anudeep

Ads

జీవితం అంటేనే కష్టనష్టాలు, సుఖదుఃఖాల కలయిక సంగమం. నిత్య జీవితంలో ఎన్నో రకాల సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా ఎన్నోరకాల తప్పుఒప్పులు కూడా జరుగుతూ ఉంటాయి.

Video Advertisement

ఇటీవల కాలంలో అత్తా కోడళ్ళ మధ్య సఖ్యత తక్కువనే చెప్పవచ్చు. ఒకరు చేసే పనులు ఒకరికి నచ్చక తరచూ గొడవ పడుతూ ఉంటారు. ఈ గొడవలకు విసిగిపోయిన కోడళ్ళు భర్తతోపాటు వేరు కాపురం పెట్టడానికి  మొగ్గుచూపుతారు.

 

అయితే ఇటీవల కాలంలో అమ్మాయిలు ఎందుకు వేరుకాపురం పెట్టడానికి మొగ్గుచూపుతున్నారు అనే విషయంపై ఒక ఇంటి కోడలు ఈ విధంగా తన Quora పోస్ట్ లో  సమాధానం ఇచ్చింది.  ఈ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే…

నా పెళ్లి అయిన కొన్ని నెలల తర్వాత మా అత్త గారు మరియు మా అత్త గారి అమ్మగారు దాదాపు అయిదు నెలలపాటు మాతోనే ఉన్నారు. ఇప్పటివరకు ఎలాంటి సమస్య లేదు. అందరం ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం.  సినిమాలకు, షికార్లకు వెళ్ళేవాళ్ళం. ఇలా ఐదు నెలలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు. అత్తగారు, అమ్మమ్మ గారు తిరిగి వెళ్ళేటప్పుడు నాకు ఎంతో బాధగా అనిపించేది.

మరలా ఒక సంవత్సరం తర్వాత మా అత్తగారు మాతో కలిసి ఉండడానికి వచ్చారు. కానీ ఈసారి పూర్తి భిన్నంగా ఉంది పరిస్థితి. మా అత్తగారు మరియు నా భర్త ఒకరికొకరు ఎక్కువగా మాట్లాడుకునేవారు. వాళ్ళ సంభాషణలో నన్ను చాలా అరుదుగా కలవని ఇచ్చేవారు. ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూడా అవసరం లేకుండా రెండు మూడు సార్లు ఫోన్ లు చేసేది అత్తయ్య.

ఒక్కోసారి  నేను ఆయన గురించి ఏదైనా చెయ్యబోతే, మా అత్తయ్య నా చేతి నుంచి లాక్కొని ఆయనకు సపర్యలు చేసేది. ఎలా అంటే అసలు నిన్ను ఇంట్లో లేని విధంగా అయన ముందు ప్రవర్తించేది.

మరీ కొన్నిసార్లు వాళ్ళు ఆహారాన్ని తీసుకోగా నాకు తక్కువగా మిగిల్చేవారు. ఈ విషయంపై నా భర్తకు కంప్లైంట్ చేస్తే, నేను ఇవి అన్నీ నా సొంత డబ్బుతో కొన్నాను మా అమ్మ ఏమి కావలిస్తే అది తీసుకోవచ్చు అంటూ గొడవ పడేవారు.

ఒక రోజు ఆమె నాకు తక్కువ ఆహారాన్ని ఇవ్వడం గమనించిన ఆయన, మా అమ్మగారిని తిట్టారు. దానికి కూడా తిరిగి మళ్ళీ నేనే కారణమని నాతో గొడవ పెట్టుకున్నారు. ఎప్పుడైతే మా అత్తగారు వచ్చారో ప్రతి 1-2 వారాలుకు ఏదో ఒక విషయం మీద గొడవ జరుగుతూనే ఉండేది. చాలా సార్లు ఒంటరిగా ఏడ్చేదాన్ని.. దాదాపు నరకం చూసినట్లే ఉండేది నా పరిస్థితి.

ఆమె ఎప్పుడు ఇంటికి వస్తుంది అన్నా నేను తిరస్కరించేదాన్ని కాదు. కాని ఆవిడ వచ్చినప్పుడల్లా నాకు భయం వేసేది. ఎందుకంటే ఎలాంటి గొడవలు తలెత్తుతాయని తలుచుకుని భయపడేదాన్ని.

ఈసారి ఆమె తో పాటు వాళ్ళ అమ్మగారు కూడా రావడం నాకు మంచిదయింది. అమ్మమ్మ గారు ఎప్పుడూ నాకు సపోర్ట్ గా ఉంటారు. కానీ నా భర్తకు అమ్మమ్మగారి అంటే ఇష్టం ఉండదు. మరి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఏ భార్య అయిన వేరు కాపురం పెట్టడానికి మొగ్గుచూపుతోంది.


End of Article

You may also like