“వైష్ణవ తేజ్” నెక్స్ట్ సినిమా PVT4 తో… “త్రివిక్రమ్ శ్రీనివాస్” కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

“వైష్ణవ తేజ్” నెక్స్ట్ సినిమా PVT4 తో… “త్రివిక్రమ్ శ్రీనివాస్” కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

by Anudeep

Ads

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఎక్కువగా టాప్ హీరోలతోనే సినిమాలు చేస్తుంటాడు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు మరియు జూనియర్ ఎన్టీఆర్.

Video Advertisement

పవన్, బన్నీతో అయితే ఏకంగా హ్యాట్రిక్ కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు మహేష్ తో మూడో సినిమాకు ముహూర్తం కూడా ఖరారైనట్టే!

అయితే ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఉప్పెన ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడంట .. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. మొదటి సినిమాతోనే 100కోట్లు కొల్లగొట్టాడు వైష్ణవ్. మొదటి సినిమాతోనే అటు మెగా ఫాన్స్ ను, ఇటు లేడీ ఫాన్స్ ను కూడా ఆకర్షించాడు వైష్ణవ్. ఉప్పెన హిట్ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లు గా వచ్చిన “కొండపొలం” ఆశించిన స్థాయిలో రాణించలేదు.

uppena 1

దీంతో స్క్రిప్ట్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని వైష్ణవ్ భావించి ఉంటాడు. ప్రస్తుతం వైష్ణవ్ నటించిన “రంగరంగ వైభవంగా” మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. గిరిసాయా దీనికి దర్శకత్వం వహించగా కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు వైష్ణవ్ కోసం గురూజీ సిద్దం చేస్తున్న స్క్రిప్ట్ కు ఆయన సతీమణి ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి సాయి సౌజన్య “సితార ఎంటర్టైన్మెంట్స్” తో కలిసి నిర్మించనున్నట్టు సమాచారం.


End of Article

You may also like