Ads
ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసత్వానికి కొదవే లేదు. హీరో హీరోయిన్ల పిల్లలు, డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ పిల్లలు వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ కెరీర్ ని కొనసాగిస్తున్నారు.
Video Advertisement
ఒక సినిమాకు డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ అతి ముఖ్యమైన వాళ్ళు. వీళ్ళు ఎంతో మంది కొత్త కుర్రాళ్లకు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు. అయితే వీరి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని హీరోలు అయిన మన డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ పిల్లలు ఎవరో ఒకసారి చూద్దాం . .
1. దాసరి నారాయణరావు:
దర్శక దిగ్గజం దాసరి నారాయణ కుమారుడు దాసరి అరుణ్ కుమార్ తండ్రి వారసత్వంతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.
2. ఈ.వీ.వీ సత్యనారాయణ:
ప్రముఖ దర్శకుడు ఈ.వీ.వీ సత్యనారాయణ కొడుకులు “అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్” ఈ.వీ.వీ వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
3. రవిరాజా పినిశెట్టి:
డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కొడుకుగా ఆది పినిశెట్టి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. ప్రస్తుతం ఆది తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు.
4. టీ.కృష్ణ
ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం వంటి రెవల్యూషనరీ సినిమాలు తీసిన తొట్టెంపూడి కృష్ణ వారసుడిగా గోపిచంద్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
5. పూరీ జగన్నాథ్:
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకుగా ఆకాష్ పూరీ హీరోగా ఇటీవలే ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
6. శోభన్:
వర్షం వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన డైరెక్టర్ శోభన్ వారసులుగా సంతోష్ శోభన్ మరియు సంగీత్ శోభన్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు.
7. విజయ నిర్మల:
ప్రముఖ నటి, డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ విజయ నిర్మల గారి కుమారుడు నరేష్ హీరోగా అప్పట్లో కొన్ని సినిమాల్లో నటించాడు.
8. ఎం.ఎస్ రాజు:
ప్రముఖ దర్శకుడు మరియు ప్రొడ్యూసర్ ఎం.ఎస్ రాజు వారసుడిగా సుమంత్ అశ్విన్ ఇటీవలే ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
9. అల్లు అరవింద్:
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసులుగా అల్లు అర్జున్, అల్లు శిరీష్ హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
10. దగ్గుబాటి సురేష్ బాబు:
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు వారసుడిగా రానా దగ్గుబాటి హీరోగా సినిమాల్లోకి అడుగు పెట్టాడు.
11. బెల్లంకొండ సురేష్:
ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు.
End of Article